‘స్పిరిట్’పై సందీప్ రెడ్డి వంగా డ్యామేజ్ కంట్రోల్..?

‘స్పిరిట్’పై సందీప్ రెడ్డి వంగా డ్యామేజ్ కంట్రోల్..?

Published on Aug 25, 2026 1:00 AM IST

ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న ‘స్పిరిట్’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, ఇటీవల నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలు ఫ్యాన్స్‌లో కొంత నిరాశకు గురిచేశాయి. ఈ సినిమా ఇంటర్నేషనల్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని, కొరియన్ స్టార్ డాన్ లీ నటిస్తారని అంతా భావించారు. కానీ ఇది పూర్తిగా హైదరాబాద్ నేపథ్యంలో సాగే ఒక లోకల్ కాప్ స్టోరీ అని, ఆ వార్తల్లో నిజం లేదని నిర్మాత స్పష్టం చేయడంతో హైప్ కొద్దిగా తగ్గింది.

బడ్జెట్ పరంగానూ తక్కువ ఖర్చుతో తెరకెక్కిస్తున్నారనే ప్రచారం జరగడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందారు. అయితే తాజాగా ఈ సినిమా ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ ప్రభాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హైలైట్‌గా నిలుస్తాయని, ఓ భారీ ట్విస్ట్ ఉంటుందంటూ వస్తున్న వార్తలు మళ్లీ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

ఇదంతా తగ్గిన హైప్‌ను మళ్లీ పెంచడానికి చేస్తున్న డ్యామేజ్ కంట్రోల్ అని కొందరు భావిస్తున్నా, త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ వైల్డ్ మాస్ అవతార్‌పై భారీ అంచనాలున్నాయి. వంగా తన మార్క్ టేకింగ్‌తో ఈ లోకల్ కాప్ స్టోరీని ఏ స్థాయిలో నిలబెడతారనే దానిపైనే సినిమా సక్సెస్ ఆధారపడి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు