కోడి రామకృష్ణ అవార్డ్స్ 2026.. ఉత్తమ యాక్టింగ్ స్కూల్‌గా వినోద్ ఫిల్మ్ అకాడమీ!

కోడి రామకృష్ణ అవార్డ్స్ 2026.. ఉత్తమ యాక్టింగ్ స్కూల్‌గా వినోద్ ఫిల్మ్ అకాడమీ!

Published on Jul 25, 2026 8:38 PM IST

Vinod Film Academy Wins Best Acting School Award 2026

హైదరాబాద్‌కు చెందిన ‘వినోద్ ఫిల్మ్ అకాడమీ యాక్టింగ్ స్కూల్’ ప్రతిష్టాత్మక ‘కోడి రామకృష్ణ అవార్డ్స్ 2026’లో “బెస్ట్ యాక్టింగ్ స్కూల్ ఇన్ హైదరాబాద్” పురస్కారాన్ని దక్కించుకుంది. నటనారంగంలో నాణ్యమైన శిక్షణ అందిస్తున్నందుకు గాను ఈ గౌరవం దక్కింది. నిర్వహించిన వేడుకలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, సీనియర్ నటుడు సుమన్, నిర్మాతలు అంబికా కృష్ణ, తుమ్మలపల్లి రామసత్యనారాయణ చేతుల మీదుగా అకాడమీ ప్రతినిధులు ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

దిగ్గజ దర్శకుడు కోడి రామకృష్ణ పేరిట నెలకొల్పిన అవార్డును ప్రముఖుల సమక్షంలో అందుకోవడం పట్ల అకాడమీ ఫౌండర్, నటుడు వినోద్ నువ్వుల ఆనందం వ్యక్తం చేశారు. తమను ఆదరిస్తున్న విద్యార్థులకు, శ్రేయోభిలాషులకు, నిర్వాహకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులోనూ చిత్రసీమకు మరింత మంది శిక్షణ పొందిన నటులను అందించడమే తమ అకాడమీ లక్ష్యమని ఆయన వెల్లడించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు