‘ది రెడ్ బ్యాగ్’ చిత్రం నుంచి ‘డిస్కో లైట్’ సాంగ్ విడుదల

‘ది రెడ్ బ్యాగ్’ చిత్రం నుంచి ‘డిస్కో లైట్’ సాంగ్ విడుదల

Published on Jul 27, 2026 8:00 AM IST

హరికృష్ణ సోమిశెట్టి నిర్మాణంలో, రవి కుమార్ సీరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది రెడ్ బ్యాగ్’ చిత్రం నుంచి ‘డిస్కో లైట్’ పాట విడుదలైంది. మెమరీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ మాస్ పార్టీ సాంగ్‌లో నటుడు కబీర్ సింగ్‌తో పాటు చిత్ర కథానాయికలు అలరించారు.

​శేఖర్ మోపురి స్వరపరిచిన ఈ రంగుల విందులాంటి పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా, ప్రముఖ గాయని గీతా మాధురి ఆలపించారు.

​ఈ చిత్రంలో కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రియేష్ గురుస్వామి ఛాయాగ్రహణం అందిస్తుండగా, శివ శర్వాణి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలు వేగవంతం చేసిన చిత్ర బృందం, సినిమా విడుదల తేదీని త్వరలోనే వెల్లడించనుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు