టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పండుగ సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు సినిమాలు వరుసగా క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో వినాయక చవితి పండుగ సందర్భంగా ఆ సెప్టెంబర్ రెండో వారంలో పలు సినిమాలు తమ రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకుంటున్నాయి.
ఇప్పటికే ఫహాద్ ఫాజిల్ నటిస్తున్న ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’, ‘ఎపిక్’, ‘మారమ్మ’ వంటి చిత్రాలు సెప్టెంబర్ రెండో వారంలో రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకున్నాయి. ఒక్కో సినిమా ఒక్కో జోనర్ నుంచి వస్తుండటంతో ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాలపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. వీటితో పాటు తమిళ హీరో కార్తీ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ చిత్రం ‘సర్దార్ 2’ కూడా అదే వారంలో రానుంది.
ఇంతటి పోటీలోకి ఇప్పుడు మరో సినిమా కూడా వచ్చి చేరింది. సముంత్ హీరోగా నటించిన మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘మహేంద్రగిరి వారాహి’ చిత్రాన్ని సెప్టెంబర్ 11న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. దీంతో వినాయక చవితి పండుగకి ఈసారి బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ ఉండబోతుందని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.


