‘పెద్ది’కి రానిది ‘జన నాయగన్’కు వస్తుందా..?

‘పెద్ది’కి రానిది ‘జన నాయగన్’కు వస్తుందా..?

Published on Jul 29, 2026 12:00 AM IST

తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విడుదలైన దళపతి విజయ్ ఆఖరి చిత్రం ‘జన నాయగన్’ బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా తడబడుతోంది. హెచ్.వినోద్ దర్శకత్వంలో ‘భగవంత్ కేసరి’ రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ… వరుస వాయిదాలు, పైరసీ మరియు దారుణమైన నెగటివ్ టాక్ కారణంగా వసూళ్లను రాబట్టలేకపోతోంది. ఈ క్రమంలో సినిమాను గట్టెక్కించేందుకు థియేట్రికల్ వర్షన్‌కు 6 డిలీటెడ్ సీన్లను జోడించనున్నట్లు దర్శకుడు స్పష్టం చేశారు.

అయితే ఈ అదనపు దృశ్యాలు సినిమా జాతకాన్ని మార్చగలవా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రానికి కూడా విడుదల తర్వాత కొత్త సీన్లు కలిపినప్పటికీ, ప్రేక్షకులు మళ్లీ థియేటర్లకు రాలేదు. కంటెంట్ కనెక్ట్ కానప్పుడు కొన్ని సీన్లు బాక్సాఫీస్ ఫలితాన్ని మార్చలేవని, నెగటివ్ టాక్ తెచ్చుకున్న ‘జననాయగన్’ విషయంలో డైహార్డ్ ఫ్యాన్స్ తప్ప సాధారణ ప్రేక్షకులు థియేటర్లకు రావడం కష్టమేనని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి ఈ సినిమాకు కొత్త సీన్స్ ఎంతమేర ప్లస్ చేస్తాయో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు