అఖిల్ అక్కినేని హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన సాలిడ్ హిట్ చిత్రం అఖిల్ కెరీర్లోనే భారీ గ్రాసర్ గా నిలిచింది. అయితే ఈ చిత్రం కోసం ఎదురు చూసిన అక్కినేని ఫ్యాన్స్ కి ఫైనల్ గా మంచి కంబ్యాక్ గా నిలిచిన ఈ చిత్రం పెర్ఫామ్ చేసిన దాని బట్టి ఓటిటిలో ఎక్స్ట్రా అమౌంట్ కూడా వస్తుంది అన్నట్టు ఆ మధ్య బజ్ వినిపించింది.
అయితే బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం 100 కోట్లు కలెక్ట్ చేస్తే సదరు ఓటిటి సంస్థ ఆ మొత్తాన్ని ఇచ్చేలా డీల్ చేసుకున్నట్టు టాక్ వినిపించింది. కానీ లెనిన్ ఈ టార్గెట్ ని రీచ్ కానట్టే అనుకోవాలి. సో లెనిన్ కి ఈ ఆఫర్ మిస్ అయ్యింది అనే అనుకోవాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా అక్కినేని నాగార్జున అలాగే నాగవంశీలు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.


