ఇండియన్ మార్కెట్ లో ‘స్పైడర్ మ్యాన్’ విధ్వంసం.. భారీ బుకింగ్స్ తో స్పైడీ బాబు ర్యాంపేజ్

ఇండియన్ మార్కెట్ లో ‘స్పైడర్ మ్యాన్’ విధ్వంసం.. భారీ బుకింగ్స్ తో స్పైడీ బాబు ర్యాంపేజ్

Published on Jul 29, 2026 11:10 AM IST

గత కొన్ని రోజులు కితం ఇండియన్ సినిమా ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన అవైటెడ్ చిత్రమే ‘ది ఒడిస్సీ’. దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఈ భారీ హిస్టారికల్ ఎమోషనల్ చిత్రం తర్వాత మళ్ళీ అంతకు మించిన హైప్ ని సెట్ చేసిన సినిమా ఏదన్నా ఉంది అంటే అది సూపర్ హీరో చిత్రం ‘స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే’ అనే చెప్పాలి.

ఈ సినిమాకి పాన్ ఇండియా లెవెల్లో ఇప్పుడు కనిపిస్తున్న హైప్ మాత్రం అంతా ఇంతా కాదు. భారీ అంచనాలు ఉండడంతో బుకింగ్స్ లో కూడా స్పైడీ బాబు ర్యాంపేజ్ చూపిస్తున్నాడు. ఇదేదో మన ఇండియన్ సినిమా స్టార్ హీరో ప్రాజెక్ట్ లా గంటకి 25 వేలకి మేర టికెట్ సేల్స్ ఇపుడు కొనసాగుతున్నాయి.

ఇది మాత్రం మామూలు విధ్వంసం కాదని చెప్పాలి. ఆల్రెడీ ప్రీ సేల్స్ లోనే 1 మిలియన్ కి పైగా టికెట్ సేల్స్ ఈ చిత్రానికి జరిగిపోయాయి. దీనితో ఇండియన్ మార్కెట్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకునే గ్రాసర్ గా నిలిచినా ఎలాంటి ఆశ్చర్యం లేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు