ఈ ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘మట్టి కుస్తీ 2’.. ఎందులో చూడొచ్చంటే!

ఈ ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘మట్టి కుస్తీ 2’.. ఎందులో చూడొచ్చంటే!

Published on Jul 29, 2026 1:04 PM IST

రీసెంట్ గా కోలీవుడ్ సినిమా దగ్గర రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచిన పలు చిత్రాల్లో ప్రముఖ హీరో విష్ణు విశాల్ హీరోగా ఐశ్వర్య లెక్ష్మి హీరోయిన్ గా దర్శకుడు చెల్లా అయ్యవు తెరకెక్కించిన స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘గట్టా కుస్తీ 2’ కూడా ఒకటి. గత కొన్నేళ్ల కితం విడుదల అయ్యిన పార్ట్ 1 కి కొనసాగింపుగా విడుదల చేసిన ఈ సినిమా తమిళ్ లో హిట్ అయ్యింది.

అయితే పార్ట్ 1 ని మేకర్స్ ‘మట్టి కుస్తీ’ పేరిట తెలుగులో కూడా విడుదల చేశారు. మాస్ మహారాజ రవితేజ సమర్పణలో ఈ సినిమా అప్పుడు తెలుగులో వచ్చింది. అయితే పార్ట్ 2 కూడా తెలుగులో మేకర్స్ మొదట కన్ఫర్మ్ చేశారు కానీ ఫైనల్ గా మాత్రం ఒక్క తమిళ్ లోనే విడుదల చేశారు.

అయితే ఇప్పుడు ఓటిటిలో డైరెక్ట్ గా తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చేసింది. తమిళ్ సహా తెలుగు ఇంకా ఇతర ముఖ్య భాషల్లో ఈ చిత్రం ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. సో ఈ సినిమా చూడాలి అనుకునేవారు నెట్ ఫ్లిక్స్ లో ఎంజాయ్ చేయవచ్చు. ఇక ఈ చిత్రానికి సీయన్ రొల్డన్ సంగీతం అందించగా ఇషారి గణేశన్, విష్ణు విశాల్ లు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు