5 రోజుల్లో 1 మిలియన్ టికెట్ సేల్స్ లో ‘చెన్నై లవ్ స్టోరీ’ సక్సెస్!

5 రోజుల్లో 1 మిలియన్ టికెట్ సేల్స్ లో ‘చెన్నై లవ్ స్టోరీ’ సక్సెస్!

Published on Jul 29, 2026 4:51 PM IST

టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ కలయికలో నటించిన తాజా చిత్రం చెన్నై లవ్ స్టోరీ ఇద్దరికీ మంచి సక్సెస్ గా నిలిచిన సంగతి తెలిసిందే. దర్శకుడు రవి నంబూరి తెరకెక్కించిన ఈ ఎమోషనల్ ఫాంటసీ ప్రేమకథ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకొని థియేటర్స్ లో దూసుకెళ్తుంది. ఇలా థియేటర్స్ లో మొత్తం 5 రోజుల రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సాలిడ్ బుకింగ్స్ కూడా నమోదు చేసింది.

రెండు ప్రముఖ బుకింగ్ యాప్స్ బుక్ మై షో, డిస్ట్రిక్ట్ లలో చెన్నై లవ్ స్టోరీ 1 మిలియన్ టికెట్ బుకింగ్స్ చేసుకొని అదరగొట్టింది. గత 24 గంటాల్లోనే 50 వేలకి టికెట్లకి పైగా అమ్ముడు పోవడంతో ఈ సినిమాకి ఈ ఫీట్ సాధ్యం అయ్యింది అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా స్టీవెన్ శంకర్ అలియాస్ సాయి రాజేష్ కథ, నిర్మాణం అందించారు. తనతో పాటుగా తన మిత్రుడు ఎస్ కే ఎన్ కూడా నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు