సమీక్ష :  ‘అదే నీవు అదే నేను’ –  కొన్ని చోట్ల మెప్పించే రొమాంటిక్ థ్రిల్లర్ !

సమీక్ష :  ‘అదే నీవు అదే నేను’ –  కొన్ని చోట్ల మెప్పించే రొమాంటిక్ థ్రిల్లర్ !

Published on Jul 31, 2026 10:00 AM IST

విడుదల తేదీ : జూలై 31, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : త్రినాధ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, తన్వి నేగి తదితరులు
దర్శకత్వం : కొండలరావు ఎల్లబోయిన
సంగీతం : కనిష్కుడు
నిర్మాతలు : గోవిందు కాండ్రేగుల
సినిమాటోగ్రఫీ : జయపాల్ రెడ్డి నిమ్మల
ఎడిటింగ్ : చోటా కె. ప్రసాద్

సంబంధిత లింక్స్ : ట్రైలర్

త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, తన్వీ నేగి, సహర్ కృష్ణన్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘అదే నీవు అదే నేను’. ఈ చిత్రాన్ని గోవిందు కాండ్రేగుల నిర్మించారు. రొమాంటిక్ థ్రిల్లర్ కథాంశంతో దర్శకుడు కొండల్ తెరకెక్కించిన సినిమా ఇది. కాగా ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

కథ :

సాగర్ (యశ్వంత్‌ పెండ్యాల) – శ్రీవల్లీ (తన్వీ నేగి) ఇద్దరు భార్యాభర్తలు. ఒక గేటెడ్ కమ్యూనిటీలో లైఫ్ ను లీడ్ చేస్తుంటారు. ఐతే, సాగర్ ఎప్పుడూ తన జాబ్ టెన్షన్ లో బిజీగా ఉంటాడు. మరోవైపు శ్రీవల్లీకి మరొకరితో క్లోజ్ గా ఉన్నట్లు కల వస్తూ ఉంటుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో.. శ్రీవల్లీ ఉండే అపార్ట్మెంట్స్ లోకి కార్తీక్ (త్రినాథ్‌ వర్మ) వస్తాడు. అతను శ్రీవల్లీకి దగ్గర అవుతాడు. వీరి మధ్య జరిగిన కొన్ని సంఘటనల అనంతరం శ్రీవల్లీ – కార్తీక్ దగ్గర అవుతారు. అలా అనుకోకుండా వారిద్దర్నీ సాగర్ చూస్తాడు. ఆ తర్వాత శ్రీవల్లీ లైఫ్ ఎలా మారింది ?, అసలు కార్తీక్ ఎవరు ?, ఆమెకు కార్తీక్ కి మధ్య కనెక్షన్ ఏమిటి ?, వారిద్దరికి సంబంధించిన ఫోటోలను చూశాక శ్రీవల్లీ ఎలా రియాక్ట్ అయ్యింది ?, అసలు శ్రీవల్లీకి కార్తీక్ కి మధ్య గతంలో ఉన్న బంధం ఏమిటి ?, చివరకు శ్రీవల్లీ లైఫ్ ఎలా టర్న్ తీసుకుంది ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

నేటి సమాజంలో మధ్య యువతీయువకుల జీవితాల్లో జరుగుతున్న సంఘటనలు ఆధారంగా రాసుకున్న సన్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా నేటితరం జాబ్ లో బిజీ కావడం వల్ల పార్టనర్ కి టైమ్ ఇవ్వలేకపోవడం, ఈ క్రమంలో భాగస్వామి పక్క చూపుల చూడటం వంటి అంశాల్ని దర్శకుడు బాగానే చెప్పారు. దర్శకుడు ఫ్యామిలీ కథలో ఎమోషన్ని పండించే ప్రయత్నం చేశాడు. పైగా ఓపెనింగ్ నుంచి మెయిన్ క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేసిన విధానం బాగుంది.

ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. ప్రధాన పాత్రలో నటించిన త్రినాథ్ వర్మ తన పాత్రలో ఒదిగిపోయారు. సీరియస్ సిచ్యుయేషన్స్ లో కూడా తన టైమింగ్ తో ‘త్రినాథ్ వర్మ’ తన పాత్రను చాలా బాగా పండించారు. తన్వీ నేగి భార్య పాత్రలో బాగా నటించింది. అదేవిధంగా యశ్వంత్ పెండ్యాల పాత్రతో పాటు ఆయన హావభావాలు బాగానే ఉన్నాయి. సునయన, బిత్తిరి సత్తి, మీర్, సూర్యతేజ, నరేందర్, సహర్ కృష్ణన్, కల్పలత లతో పాటు ఇతర కీలక పాత్రల్లో నటించిన మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్ :

కొండల్‌ తీసుకున్న కథాంశం బాగున్నప్పటికీ.. కథనం మాత్రం కొన్ని చోట్ల సింపుల్ గా చాలా స్లోగా సాగింది. ఇంట్రెస్ట్ కలిగించలేని ట్రీట్మెంట్ తో సింపుల్ గా అనిపిస్తోంది. పైగా కీలక సన్నివేశాలు కూడా లాజికల్ గా కనెక్ట్ కావు. ముఖ్యంగా హీరోయిన్ పాత్రతో పాటు ఆమె ఫ్యామిలీ తాలూకు పాత్రలను కూడా ఇంకా బలంగా రాసుకోవాల్సింది. అలాగే, హీరోహీరోయిన్ల మధ్య స్టార్టింగ్ లో వచ్చే సన్నివేశాలు కూడా ల్యాగ్ అయ్యాయి.

నిజానికి ఓ అమ్మాయి ఆరోగ్యం కోసం ఆమె చుట్టూ ఉన్నవాళ్ళంతా తపన పడటం అనే పాయింట్ చుట్టూ ఇంకా కాన్ ఫ్లిక్ట్ ను బిల్డ్ చేసి.. ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కూడా ఇంకా బరువైన భావోద్వేగాలను పెట్టి ఉంటే బాగుండేది. ఓవరాల్ గా దర్శకుడు స్క్రిప్ట్ లో ఉన్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేశారు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. కొండల్ దర్శకుడిగా ఆకట్టున్నారు. సంగీత దర్శకుడు కనిష్క అందించిన పాటలు పర్వాలేదు. అదే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని కీలక సన్నివేశాల్లో పర్వాలేదు. ఇక ఎడిటర్ అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది. జయపాల్ రెడ్డి నిమ్మల సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాత గోవిందు కాండ్రేగుల నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

‘అదే నీవు అదే నేను’ అంటూ వచ్చిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాలో.. మెయిన్ థీమ్, కొన్ని లవ్ సీన్స్, అలాగే మెయిన్ ఎమోషన్ బాగున్నాయి. ఐతే, మెయిన్ ట్రీట్మెంట్ కొన్ని చోట్ల ఆసక్తికరంగా సాగకపోవడం, అలాగే ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే కొన్ని ఇల్లాజికల్ సీన్స్ వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో కొన్ని లవ్ ఎలిమెంట్స్ బాగా కనెక్ట్ అవుతాయి.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

సంబంధిత సమాచారం

తాజా వార్తలు