టీజర్ టాక్ : ‘సర్దార్ 2’ – ఫుల్ ఆన్ యాక్షన్ మోడ్‌లోకి కార్తి..!

టీజర్ టాక్ : ‘సర్దార్ 2’ – ఫుల్ ఆన్ యాక్షన్ మోడ్‌లోకి కార్తి..!

Published on Jul 31, 2026 7:16 PM IST

తమిళ హీరో కార్తి, దర్శకుడు పి.ఎస్.మిత్రన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్ 2’. 2022లో వచ్చిన బ్లాక్‌బస్టర్ హిట్ ‘సర్దార్’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంపై మొదటి నుంచీ భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ఈ టీజర్‌లో కార్తీ పవర్‌ఫుల్ యాక్షన్ అవతార్‌లో కనిపించి అభిమానులను థ్రిల్ చేశాడు. మొదటి భాగం కంటే మరింత భారీ స్థాయిలో హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్, ఆకట్టుకునే డ్రామాతో మిత్రన్ ఈ సీక్వెల్‌ను తీర్చిదిద్దినట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. అంతేకాకుండా, విలన్‌గా విలక్షణ నటుడు ఎస్. జె. సూర్య ఎంట్రీ మరియు సామ్ సీఎస్ అందించిన దద్దరిల్లే బీజీఎం టీజర్‌కు మెయిన్ హైలైట్స్‌గా నిలిచాయి.

మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని బిగ్ స్క్రీన్‌పై విజువల్ వండర్‌గా అందించేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఇక ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 10న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు