దూసుకుపోతున్న ‘కొరియన్ కనకరాజు’.. ఏకంగా 8 లక్షల టికెట్ల అమ్మకం..!

దూసుకుపోతున్న ‘కొరియన్ కనకరాజు’.. ఏకంగా 8 లక్షల టికెట్ల అమ్మకం..!

Published on Aug 10, 2026 9:02 PM IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ ఎంటర్‌టైనర్ ‘కొరియన్ కనకరాజు’ థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతుంది. మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలోని హారర్ అండ్ కామెడీ బాగా వర్కవుట్ కావడంతో ప్రేక్షకులు ఈ చిత్రం కోసం థియేటర్లకు క్యూ కడుతున్నారు.

ఇక ఈ సినిమా ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లైన బుక్‌మైషో మరియు డిస్ట్రిక్ట్ ఇండియాలో ఏకంగా 800K(8 లక్షలు)కి పైగా టికెట్లు అమ్ముడై సరికొత్త రికార్డు సృష్టించింది. రితికా నాయక్ గ్లామర్ మరియు సత్య కామెడీ టైమింగ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ లభిస్తుంది.

బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకెళ్తున్న ఈ నాన్-స్టాప్ ఎంటర్‌టైనర్ సినిమా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్‌కు తక్కువ టైమ్‌లో చేరుకోవడం విశేషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు