మ్యాడ్ హిట్ ‘డిసి’ కాంబినేషన్ మళ్ళీ..?

మ్యాడ్ హిట్ ‘డిసి’ కాంబినేషన్ మళ్ళీ..?

Published on Aug 11, 2026 10:01 PM IST

లేటెస్ట్ గా సినిమా లవర్స్ కి థియేటర్స్ లో క్రేజీ ట్రీట్ ఇచ్చిన చిత్రమే ‘డిసి’. దర్శకుడు లోకేష్ కనకరాజ్ హీరోగా హీరోయిన్స్ వామికా గబ్బి, సంజన కలయికలో దర్శకుడు అరుణ్ మాదేశ్వరన్ తెరకెక్కించిన ఈ సాలిడ్ హిట్ చిత్రం కోసమే ప్రస్తుతం మూవీ లవర్స్ లో చర్చ నడుస్తుంది. ఒక సినిమాని చిత్ర యూనిట్ అంతా ప్రేమించి చేస్తే ఎలా ఉంటుందో అలా ఉందని డిసి చిత్రానికి ప్రశంసలు ఇప్పుడు ఆగడం లేదు.

మరి ఇలాంటి ఒక మ్యాడ్ స్టఫ్ ని అందించిన కాంబినేషన్ లో మళ్ళీ సినిమా అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇదే టాక్ సినీ వర్గాల్లో వినిపిస్తుంది. లోకేష్ కనకరాజ్ హీరోగా అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వంలో మళ్ళీ అనిరుద్ సంగీతం లోనే డిసి నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ తోనే మరో సినిమా ఇప్పుడు ఓకే అయినట్టు తెలుస్తుంది. ఇక దీనిపై అతి త్వరలోనే అనౌన్సమెంట్ కూడా రావచ్చట. ఇదే నిజం అయితే మాత్రం మరోసారి మూవీ లవర్స్ కి పండగే అని చెప్పవచ్చు.

తాజా వార్తలు