తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ప్రధాన పాత్రలో, అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘డీసీ’. ప్రముఖ నటి వామిగా గబ్బి కథానాయికగా నటించిన ఈ చిత్రం, థియేటర్లలో విభిన్నమైన బాక్సాఫీస్ ట్రెండ్‌ను నమోదు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తొలి 4 రోజుల్లో దాదాపు రూ. 40 కోట్ల + గ్రాస్ మార్కును అందుకుంది.
ఉత్తరాదిన నిరాశ.. తమిళనాడులో తగ్గిన జోరు
నటి వామిగా గబ్బికి హిందీ బెల్ట్‌లో మంచి గుర్తింపు ఉన్నప్పటికీ, ఉత్తరాది ప్రేక్షకులు ఈ చిత్రంపై పెద్దగా ఆసక్తి చూపలేదు. హిందీ వెర్షన్‌కు సరైన బజ్ లేకపోవడంతో అక్కడ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది.
ఇక తమిళనాడులో మొదటి మూడు రోజులు ఓపెనింగ్స్ బాగున్నప్పటికీ, సోమవారం వచ్చేసరికి థియేటర్లలో హోల్డ్ తగ్గింది. అనుకున్న స్థాయిలో కలెక్షన్లు నిలకడగా కొనసాగకపోవడంతో తమిళ మార్కెట్లో నెమ్మదించింది.
తెలుగు రాష్ట్రాల్లో మెరుగైన వసూళ్లు
అయితే, తమిళనాడులో సోమవారం నమోదైన గ్రాస్ వసూళ్లతో పోలిస్తే, తెలుగు రాష్ట్రాల్లోనే కలెక్షన్లు ఎక్కువగా ఉండటం విశేషం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ లభించడంతో వర్కింగ్ డే అయిన సోమవారం కూడా తెలుగు వెర్షన్ మంచి నిలకడను ప్రదర్శించింది. ఓవరాల్ రన్‌లో తెలుగు డిస్ట్రిబ్యూటర్లకు ఈ చిత్రం లాభదాయకంగా మారే అవకాశం కనిపిస్తోంది.


