రమణారెడ్డి సోమ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘అమీర్ లోగ్’. అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ పతాకంపై మాధవి రెడ్డి సోమ నిర్మించిన ఈ చిత్ర ట్రైలర్ను గురువారం విడుదల చేశారు. హైదరాబాద్ నగర నేపథ్యంతో, సహజత్వానికి దగ్గరగా సాగే కథాంశంతో ఈ సినిమాను రూపొందించినట్లు చిత్రబృందం తెలిపింది. ఎంసీ హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా, వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి ఇతర కీలక పాత్రలు పోషించారు.
ట్రైలర్ విడుదల కార్యక్రమంలో దర్శకుడు సాయి మార్తాండ్, సంగీత దర్శకుడు సింజిత్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. హైదరాబాద్ సంస్కృతి, బస్తీ జీవితం నేపథ్యంలో వినోదం, భావోద్వేగాల కలయికగా ఈ చిత్రం ఉంటుందని దర్శకుడు రమణారెడ్డి సోమ పేర్కొన్నారు.
ఈ చిత్రానికి సాయి స్మరణ్ సంగీతం అందించగా, ఎస్వీకే ఛాయాగ్రహణం, రోహిత్ పెనుమత్స కూర్పు (ఎడిటింగ్) బాధ్యతలు నిర్వహించారు. ప్రముఖ నటుడు రానా దగ్గుబాటికి చెందిన ‘స్పిరిట్ మీడియా’ ద్వారా ఈ చిత్రాన్ని ఆగస్ట్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


