సమీక్ష : మకుటం – బోరింగ్ యాక్షన్ డ్రామా !

సమీక్ష : మకుటం – బోరింగ్ యాక్షన్ డ్రామా !

Published on Aug 14, 2026 6:20 PM IST

విడుదల తేదీ : ఆగస్టు 14, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు : విశాల్, దుషారా విజయన్, అంజలి, తంబి రామయ్య, జయప్రకాష్ తదితరులు.
దర్శకత్వం : విశాల్
సంగీతం : జి.వి. ప్రకాష్ కుమార్
నిర్మాతలు : ఆర్.బి చౌదరి
సినిమాటోగ్రఫీ : రిచర్డ్ ఎం. నాథన్
ఎడిటింగ్ : ఎన్.బి. శ్రీకాంత్

సంబంధిత లింక్స్ : ట్రైలర్

విశాల్, దుషారా విజయన్, అంజలి కీలక పాత్రల్లో తెరకెక్కిన మూవీ మకుటం. కాగా ఈ రోజు రిలీజ్ అయిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం.

కథ :

కృప (విశాల్) జమున (దుషారా విజయన్)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. తన ఇద్దరి పిల్లలతో లైఫ్ ను లీడ్ చేస్తుంటాడు. మరోవైపు మెడికల్ రిప్రజెంట్ ఉద్యోగిగా కష్టాలు పడుతూ ఉంటాడు. చాలీ చాలని జీతంతో జీవితాన్ని వెళ్ళదీస్తూ.. తన మామగారితో చెప్పిన అబద్ధం కారణంగా.. కృప, ఓ బీఎండబ్ల్యూ కారు కొంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో కృప తన ఫ్యామిలీతో కలిసి తాను కొన్న కారులో ఊటీ వెళతాడు. అక్కడ ఎటాక్ జరుగుతుంది. ఆ సమయంలో అతని భార్య, అతని కూతురు చనిపోతారు. అసలు నెలకు పాతిక వేలు జీతం వచ్చే సామాన్య ఉద్యోగిపై ఎటాక్ ఎందుకు జరిగింది ?, అలా జరగడానికి కారణం ఏమిటి ?, ఈ మధ్యలో లింగా (విశాల్), అన్నపూర్ణ (అంజలి) ఎవరు ?, వారికి – కృపకి ఉన్న కనెక్షన్ ఏమిటి ?, చివరకు ఈ కథ ఎలాంటి మలుపు తిరిగింది ? అనేది సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ఎప్పటిలాగే విశాల్ తన పాత్రలో అద్భుతంగా నటించాడు. కీలక సన్నివేశాల్లో విశాల్ యాక్షన్ గ్రెస్ అండ్ ఎమోషల్ సీన్స్ లో అతని అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. మొత్తానికి తన పాత్రల్లో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ, తన పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ తో విశాల్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. దుషారా విజయన్ తన పాత్రలో ఒదిగిపోయారు. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆమె నటన చాలా బాగుంది. అంజలి తన పాత్రలో జీవించింది. ఆమె పాత్రలోని డెప్త్ కూడా ఆకట్టుకుంది. ఆమె స్రీన్ ప్రెజెన్సీ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రల్లో కనిపించిన తంబి రామయ్య, జయప్రకాష్ ఆకట్టుకున్నారు. అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా అయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాలో మూస ధోరణి ఎక్కువైంది. ‘మకుటం’గా వచ్చిన ఈ చిత్రం రొటీన్ ఎమోషన్స్ తో, బోరింగ్ యాక్షన్ సీన్స్ తో సాగింది. కథనం పరంగా వచ్చే చాలా సీన్స్ కూడా బోరింగ్ ప్లేతో సాగాయి. దర్శకడు విశాల్ ఈ సినిమా ట్రీట్మెంట్ ను బాగా రాసుకోలేదు. ముఖ్యంగా ఆసక్తికరంగా కథనాన్ని రాసుకోవడంలో విశాల్ విఫలం అయ్యారు. చాలా సన్నివేశాలు బాగా స్లోగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది.

పైగా సెకండాఫ్ ని మరీ సాగతీశారు. ఒక్క క్లైమాక్స్ లో తప్ప మిగిలిన కథనంలో ఉత్సుకతను పెంచటంలో విఫలమయ్యారు. ఇక విశాల్ – విలన్ల మధ్య ట్రాక్ మరీ దారుణంగా సాగింది. అలాగే కొన్ని ఇన్సిడెంట్స్ మరీ సినిమాటిక్ గా అనిపిస్తాయి. దీనికి తోడు సినిమాలో ఇంట్రసింగ్ ప్లేను బిల్డ్ చేయలేకపోయారు. హీరో క్యారెక్టైజేషన్ ను ఇంకా ఎఫెక్టివ్ గా రాసుకోవాల్సింది. మొత్తానికి కథలో చెప్పాలనుకున్న మెయిన్ థీమ్ తో పాటు కీలక సన్నివేశాలు కూడా బాగాలేదు.

సాంకేతిక విభాగం :

ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. సినిమాటోగ్రాఫర్‌ రిచర్డ్ ఎం. నాథన్ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా బాగాలేదు. ఇక సంగీత దర్శకుడు సమకూర్చిన పాటలు జస్ట్ ఓకే. ఐతే నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి విశాల్ పూర్తి న్యాయం చేయలేదు. నిర్మాత ఆర్.బి చౌదరి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి.

తీర్పు :

మాస్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ ‘మకుటం’ సినిమా ఆకట్టుకోలేకపోయింది. సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ… ఆ ఎమోషన్ లో, ఆ కాన్ ఫ్లిక్ట్ లో ప్రేక్షకుడు ఇన్ వాల్వ్ అయ్యేంతగా.. అవి సరిగ్గా ఎస్టాబ్లిష్మెంట్ కాలేదు. దీనికితోడు బోరింగ్ అండ్ బ్యాడ్ ప్లే, సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమా కనెక్ట్ కాదు.

123telugu.com Rating: 2/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు