సమీక్ష: ‘అగధ’ – కొన్ని చోట్ల ఓకే అనిపించే థ్రిల్లర్ డ్రామా

సమీక్ష: ‘అగధ’ – కొన్ని చోట్ల ఓకే అనిపించే థ్రిల్లర్ డ్రామా

Published on Aug 14, 2026 11:03 PM IST

విడుదల తేదీ : ఆగస్టు 14, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : కామాక్షి భాస్కర్ల, ఉల్కా గుప్త, శ్రవణ్ రెడ్డి, వైవా రాఘవ్, జోవిక విజయ్, షిజు అబ్దుల్ రషీద్, రోషన్ బషీర్ తదితరులు
దర్శకత్వం : ఎం ఎస్ రాజు
నిర్మాత : కాశీ విశాలాక్షి బలుసు
సంగీతం : రాకేష్ వెంకటాపురం
ఛాయాగ్రహణం : నాని చమిడిశెట్టి
కూర్పు : జునైద్ సిద్దిఖీ

సంబంధిత లింక్స్ : ట్రైలర్

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన చిత్రాల్లో ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎం ఎస్ రాజు తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం ‘అగధ’ కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

ఛత్తీస్ ఘర్, బస్తర్ అటవీ ప్రాంతంలో పోలీసులు బ్యాన్ చేయబడిన ఒక మిస్టీరియస్ గుహ లోకి వెళదామని యూట్యూబర్స్ అయ్యిన ముగ్గురు స్నేహితులు మహిమ (ఉల్కా గుప్త), షామ్ (శ్రవణ్ రెడ్డి) అలాగే బబ్లు (వైవా రాఘవ్) వెళతారు. కానీ ఊహించని విధంగా షామ్ మిస్సవుతాడు, బబ్లు చనిపోతాడు. ఈ క్రమంలో తప్పించుకున్న మహిమ కూడా కొన్ని నెలల తర్వాత చనిపోతుంది. అసలు వీరంతా ఎందుకు చనిపోయారు? మిస్సయిన షామ్ కి ఏమైంది? ఈ మరణాల మిస్టరీ వెనుక ఉన్న అగధ (?) ఎవరు? ఈ మిస్టరీ ఛేదించడానికి వచ్చిన యోగిని మహాదేవి (కామాక్షి భాస్కర్ల) ఏం చేసింది? ఆమెకి మహిమకి ఉన్న సంబంధం ఏంటి? చివరికి ఆమె ఆ మిస్టరీ కనుక్కుందా లేదా? అగధ ని ఎలా ఆపుతుంది అనేది ఇందులో మిగతా కథ.

ప్లస్ పాయింట్స్:

దర్శకునిగా మారిన తర్వాత ఎం ఎస్ రాజు నుంచి ఇది మరో కొత్త కాన్సెప్ట్ గా టచ్ చేయడం జరిగింది. అయితే ఇందులో అగధ అంటూ తీసుకున్న పాయింట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దాని చుట్టూ అల్లుకున్న సస్పెన్స్ తో కూడిన కొన్ని సీన్స్ అక్కడక్కడా ఇంప్రెస్ చేస్తాయి. అలాగే ఒకటీ రెండు చోట్ల డివోషనల్ మూమెంట్స్ ఎగ్జైట్ చేస్తాయి.

ఇక నటీనటుల్లో కామాక్షి భాస్కర్ల తన రోల్ కి పూర్తి న్యాయం చేసింది. ఒక యోగినిగా అందులోని డెప్త్ తో ఆమె నీట్ గా పెర్ఫామ్ చేసి ఆకట్టుకుంది. అలాగే ఉల్కా గుప్త కూడా తన రోల్ కి బాగా సెట్ అయ్యింది. అందులోని ఎమోషన్ ని చూపిస్తూ ఆమె బాగా నటించింది.

ఇక శ్రవణ్ రెడ్డి తన నుంచి భిన్నమైన షేడ్స్ తో కూడిన పాత్రలో బాగా చేసాడు. హ్యాండ్సమ్ లుక్స్ లో కనిపిస్తూనే నెగిటివ్ సీన్స్ లో కూడా ఇంటెన్సిటీని కనబరిచాడు. ఇక వీరితో పాటుగా సీనియర్ నటుడు షిజు అబ్దుల్ రషీద్ కూడా తన పాత్రలో మెప్పించారు. ఇక వీరితో పాటుగా ఇతర నటీనటులు కూడా బాగానే చేశారు.

మైనస్ పాయింట్స్:

ఈ చిత్రంలో కాన్సెప్ట్ కొంతవరకు ఓకే కానీ దీనితో నడిపించే కథనమే కొంచెం డిజప్పాయింట్ చేస్తుంది. ఫస్టాఫ్ లో కొంతమేర వరకు పర్వాలేదు అనిపించినా సెకండాఫ్ లో ఇంకా బలంగా ఉంటుంది అని ఆశిస్తే సెకండాఫ్ బలహీనంగా మారింది. ఈ మధ్య కాలంలోనే వచ్చిన రొటీన్ మిస్టరీ థ్రిల్లర్స్ తరహాలోనే ఇది కూడా సాగడంతో కొంత సేపటి తర్వాత బోర్ ఫీల్ కలుగుతుంది.

పైగా సీన్స్ లో సస్పెన్స్ మైంటైన్ చేయడం కోసం చేసిన కట్స్ మరీ ఎక్కువ అయ్యిపోయినట్టు అనిపిస్తుంది. ఇలా ఇవి కూడా కొంత సమయం తర్వాత చికాకు తెప్పిస్తాయి. ఇక వీటితో పాటుగా కొన్ని సీన్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడం ఒకటి చూసే ఆడియెన్స్ కి మరింత బోర్ ని కలిగిస్తుంది.

సినిమాలో రోషన్ బషీర్, శ్రేయ రాణిల పాత్రలు సినిమాలో అనవరసంగా పెట్టినట్టు అనిపిస్తుంది. వారి వల్ల సినిమాలో అదనపు నిడివి తప్పితే పెద్దగా వినియోగం లేనట్టు అనిపిస్తుంది. ఇక చివరగా క్లైమాక్స్ కి వచ్చే సరికి సినిమాలో చాలా వరకు సన్నివేశాలు కొన్ని హాలీవుడ్ సీన్స్ కాన్సెప్ట్ లు ప్రేరణగా తీసుకున్నారా అనిపిస్తుంది. ఆ టైం లూప్ సీన్, కామాక్షి ఆత్మ కాలంలో వెనక్కి వెళ్లడం వంటివి స్ట్రేంజర్ థింగ్స్, డాక్టర్ స్ట్రేంజ్ 1 లాంటి వాటిలో చూసినట్టే ఉంటాయి. వాటికి మన టచ్ అందించారు.

సాంకేతిక వర్గం:

ఇందులో నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయి. కాన్సెప్ట్ కి కావాల్సిన సెటప్ ని బాగా డిజైన్ చేసుకున్నారు. రాకేష్ వెంకటాపురం సంగీతం బాగుంది. నాని చమిడి శెట్టి కెమెరా వర్క్ బాగుంది. జునైద్ సిద్ధఖీ ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్ గా కట్ చేయాల్సింది. మెయిన్ గా ల్యాగ్ సీన్స్ రిపీట్ సన్నివేశాలు తగ్గించాల్సింది.

ఇక దర్శకుడు ఎం ఎస్ రాజు విషయానికి వస్తే.. తాను దర్శకునిగా మారిన తర్వాత టచ్ చేసిన మరో ఫ్రెష్ సబ్జెక్టు ఇది. కానీ ఇందులో కథనం నడిపించిన తీరు ఇంకా బెటర్ గా ఉండాల్సింది. పైగా రిపీటెడ్ సీన్స్ కూడా బోరింగ్ గా అనిపిస్తాయి. కానీ కొన్ని కొన్ని చోట్ల మాత్రం తాను డిజైన్ చేసుకున్న సీన్స్, థ్రిల్ మూమెంట్స్ మాత్రం ఆకట్టుకుంటాయి.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘అగధ’ అక్కడక్కడా ఓకే అనిపించే మిస్టరీ థ్రిల్లర్ గా నిలుస్తుంది. దర్శకుడు ప్లాన్ చేసుకున్న కోర్ కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. అలాగే దానికి అనుగుణంగా కొన్ని సీన్స్ అక్కడక్కడా బాగున్నాయి. కానీ పూర్తి స్థాయిలో ఇదే తరహాలో కథనం కొనసాగితే బాగుండేది. సో ఈ చిత్రం థ్రిల్లర్ మూవీ లవర్స్ కి కొంతమేర ఓకే అనిపిస్తుంది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు