మెగా 158 రిలీజ్ క్లారిటీ కూడా అప్పుడేనా!?

మెగా 158 రిలీజ్ క్లారిటీ కూడా అప్పుడేనా!?

Published on Aug 19, 2026 7:58 AM IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తన హిట్ దర్శకుడు కొల్లి బాబీ కలయికలో చేస్తున్న సినిమా కోసం అందరికీ తెలిసిందే. చిరు హీరోగా చేస్తున్న 158వ సినిమా ఇది కాగా భారీ అంచనాలు దీనిపై ఉన్నాయి. అయితే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులకి ఈ ఆగస్ట్ 22 చిరు పుట్టినరోజుకి బిగ్ ట్రీట్ ఆల్రెడీ సిద్ధంగా ఉంది.

పైగా షూట్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ టైటిల్ టీజర్ తో పాటుగా సినిమా విడుదల తేది కూడా అదే రోజు అధికారికంగా ప్రకటించనున్నారు అని తెలుస్తోంది. సో దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో యిఉంగ5హీరోయిన్ అనస్వర రంజన్ చిరు కూతురు పాత్రలో నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే కే వి ఎన్ ప్రొడక్షన్స్ నిర్మాణం వహిస్తున్నారు.

తాజా వార్తలు