‘టాక్సిక్’కు అడ్వాన్స్ బుకింగ్స్.. ఎప్పట్నుంచి అంటే..?

‘టాక్సిక్’కు అడ్వాన్స్ బుకింగ్స్.. ఎప్పట్నుంచి అంటే..?

Published on Aug 19, 2026 1:01 AM IST

‘టాక్సిక్’ సినిమాతో యష్ మరోసారి బాక్సాఫీస్ వద్ద రచ్చ చేసేందుకు సిద్ధమయ్యాడు. గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఆగస్టు 21 నుంచి ప్రారంభం కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

అడ్వాన్స్ బుకింగ్స్ వివరాలతో పాటు రెడ్ బ్యాక్‌డ్రాప్‌లో యష్‌ను రగ్గడ్ లుక్‌లో చూపిస్తూ విడుదల చేసిన పోస్టర్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో యష్ డ్యుయెల్ రోల్ చేస్తుండగా.. నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు