మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్‌పై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని మైథలాజికల్ అంశాలతో రూపొందించబోతున్నట్లు ఇప్పటికే రిలీజ్ చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. అయితే, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి టైటిల్ విషయంలో ఓ క్రేజీ న్యూస్ సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.
ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ‘గాడ్ ఆఫ్ వార్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు గతంలోనే వార్తలు వినిపించాయి. అయితే, ఇప్పుడు ఈ చిత్రానికి మరో ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నారట. ఈ సినిమాకు ‘దేవసేనాపతి’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను కూడా మేకర్స్ కన్సిడర్ చేస్తున్నారట. ఈ టైటిల్ మైథలాజికల్ మరియు మాస్ అప్పీల్‌తో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుందని మేకర్స్ భావిస్తున్నారు.
గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడంతో, ఈ కొత్త ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం తమ ఇతర సినిమాలతో బిజీగా ఉన్న తారక్, త్రివిక్రమ్‌లు ఈ కమిట్‌మెంట్లు పూర్తి కాగానే సెట్స్ పైకి వెళ్లనున్నారు. అయితే ఈ రెండింటిలో ఏ టైటిల్‌ను ఖరారు చేస్తారనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.


