యూఎస్ మార్కెట్ లో మాస్ ర్యాంపేజ్ చూపిస్తున్న రవితేజ సినిమా!

యూఎస్ మార్కెట్ లో మాస్ ర్యాంపేజ్ చూపిస్తున్న రవితేజ సినిమా!

Published on Aug 19, 2026 9:01 AM IST

Irumudi

మాస్ మహారాజ రవితేజ హీరోగా ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమే ‘ఇరుముడి’. అనౌన్స్ చేసిన ఆరంభం నుంచే మంచి హైప్ ని సెట్ చేసుకున్న ఈ చిత్రం రిలీజ్ కి దగ్గరకి వస్తుంది. అయితే ఈ సినిమాకి యూఎస్ మార్కెట్ లో సాలిడ్ వెల్కమ్ దక్కేలా ఉందని చెప్పాలి.

రవితేజ కెరీర్ లో మరో బెస్ట్ ఓపెనింగ్స్ ఈ సినిమాకి అక్కడ రావచ్చు. అక్కడ ఆల్రెడీ ప్రీసేల్స్ లో 10 వేలకి పైగా టికెట్ సేల్స్ ని ఈ చిత్రం జరుపుకొని మంచి బుకింగ్స్ పై కన్నేసింది. అలాగే లక్ష 50 వేల డాలర్స్ గ్రాస్ మార్క్ వైపుగా కేవలం ఈ ప్రీసేల్స్ తోనే దూసుకెళ్తుంది. సో నార్త్ అమెరికాలో ఇరుముడి మంచి ఓపెనింగ్స్ రాబట్టడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. అలాగే రవితేజ నుంచి కరెక్ట్ కంటెంట్ పడితే దాని ర్యాంపేజ్ కూడా ఈ విధంగా ఉంటుంది అని చెప్పొచ్చు.

తాజా వార్తలు