సమీక్ష: ‘అమీర్ లోగ్’ – కొన్ని చోట్ల మెప్పించే యూత్ ఎంటర్టైనర్

సమీక్ష: ‘అమీర్ లోగ్’ – కొన్ని చోట్ల మెప్పించే యూత్ ఎంటర్టైనర్

Published on Aug 21, 2026 11:03 PM IST

విడుదల తేదీ : ఆగస్టు 21, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : హరి మున్నగి, శశిధర్, మనోజ్, విశ్వేందర్ రెడ్డి కొమ్మిడి, వేద జలంధర్, రావణ్ నిట్టూరు తదితరులు
దర్శకత్వం : రమణ రెడ్డి సోమ
సంగీతం : స్మరన్ సాయి
నిర్మాణం : మాధవి రెడ్డి సోమ
ఛాయాగ్రహణం : సలిగంటి విజయ్ కుమార్
కూర్పు: రోహిత్ పెనుమత్స

సంబంధిత లింక్స్ : ట్రైలర్

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో ఓ చిన్న యూత్ ఫుల్ డ్రామా చిత్రం ‘అమీర్ లోగ్’ కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉంది అనేది సమీక్షలో చూద్దాం రండి.

కథ:

హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ముగ్గురు మాస్ కుర్రాళ్ళు శ్రీను (హరి మున్నగి), మల్లేష్ (శశిధర్) అలాగే రఫీఖ్ (మనోజ్) మంచి స్నేహితులు. అయితే ఎలాంటి భాద్యతలు లేకుండా తిరిగే వాళ్ళకి చాచా (విశ్వేందర్ రెడ్డి కొమ్మిడి) అంటే ఎంతో ఇష్టం, గౌరవం. ఓరోజు తమ చాచా చేసిన పక్కా హైదరాబాదీ బిర్యానీ తిని వాళ్లంతా ఫ్లాట్ అవుతారు. అయితే కొన్ని పరిణామాల తర్వాత తమ అక్క గీత (వేద జలంధర్) పని చేసే సాఫ్ట్వేర్ ఆఫీస్ కి చెందిన అడ్మిన్ రవి (రావణ్ నిట్టూరు) నుంచి ఆ బిర్యానీ విషయంలో ఓ బిజినెస్ ఆఫర్ వస్తుంది. ఇక అక్కడ నుంచి కొత్త టర్న్ తీసుకున్న ఈ ముగ్గురు స్నేహితుల లైఫ్ ఎలా మారింది. ఆ బిజినెస్ లో వీరు సక్సెస్ అయ్యారా లేదా? ఆ బిర్యానీ బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేశారు? అది సజావుగా సాగిందా లేదా? ఈ ప్రయాణంలో వారు తెలుసుకుంది ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

టాలీవుడ్ లో ఇది వరకు ఫ్రెండ్షిప్ నేపథ్యంలో అది కూడా పక్కా హైదరాబాదీ నేపథ్యంలో వచ్చిన సినిమాల్లో ఇది కూడా ఒకటని చెప్పొచ్చు. చాలా నాచురల్ గా అక్కడక్కడా మంచి మూమెంట్స్ తో ఈ సినిమాలో కథనం దాదాపు వెళుతుంది. ముఖ్యంగా ఫస్టాఫ్ ని దర్శకుడు డీసెంట్ మూమెంట్స్ తో తీసుకెళ్లిపోయాడు. కొన్ని సీన్స్ ఆల్రెడీ చూసినట్టే ఉంటాయి.

కానీ ఆ మూమెంట్స్ ఆహ్లాదంగా వెళ్లిపోతాయి. అలాగే ఇందులో దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కూడా ఇందులో బాగుంది. ఫ్రెండ్షిప్ పై సెట్ చేసిన కొన్ని సీన్స్ పక్కన పెడితే.. వారిపై రాసుకున్న చిన్నపాటి సందేశం బాగుంది అని చెప్పొచ్చు. ఎవరికైనా సరే పని చేసుకుంటేనే ఇజ్జత్ (గౌరవం) ఉంటుంది అనే పాయింట్ ని దర్శకుడు బాగా ఎస్టాబ్లిష్ చేశారు.

కేవలం ఎంజాయ్మెంట్ ఒకటే కాదు. పని చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలవాలి అనే పాయింట్ ని అక్కడక్కడా మంచి కామెడీ, సాలిడ్ మ్యూజిక్ టేస్ట్ తో తీసుకెళ్లడం ఇందులో బాగుంది. ఇక తమ పాత్రల్లో ముగ్గురు యువనటులు హరి, శశిధర్, మనోజ్ లు పర్ఫెక్ట్ గా చేశారు. వీరి పాత్రల డిజైన్ కూడా సినిమాలో బాగుంది. వీరితో పాటుగా సీనియర్ నటుడు విశ్వేందర్ రెడ్డి కొమ్మిడి మంచి సపోర్ట్ అందించారు. అలాగే వేద, రావణ్ నిట్టూరు, సాయి యోగిలు కూడా తమ పెర్ఫామెన్స్ లతో సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచారు.

మైనస్ పాయింట్స్:

ఇందులో దాదాపు మూమెంట్స్ ప్లెజెంట్ గానే సాగాయి కానీ కథ, కొన్ని చోట్ల కథనం మాత్రం కొత్తవైతే కాదు. తెలుగులో ఇది వరకు ఈ తరహా ఫ్రెండ్షిప్ నేపథ్యపు సినిమాలు చాలానే వచ్చాయి. అవన్నీ ఇది చూస్తున్నంతసేపు గుర్తు రాక మానవు. ఒక పెళ్లి చూపులు, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఇలా పలు సినిమాలు హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో గుర్తు వస్తాయి.

వీటితో ఇందులో కొత్తదనం కొంచెం లోపించినట్టు అనిపిస్తుంది. అలాగే సినిమా సెకండాఫ్ కొంచెం సాగదీతగా వెళ్ళింది అని చెప్పక తప్పదు. ముఖ్యంగా ప్రీక్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ పార్ట్ వరకు కథనం సాగదీసినట్టు అనిపిస్తుంది. ఆ మూమెంట్స్ ని కొంచెం కుదించి కట్ చేసి ఉంటే పర్ఫెక్ట్ గా ఉండేది. ఈ అంశాలు చిత్రంలో బలహీనతలుగా నిలిచాయి. అప్పటివరకు బిల్డ్ చేసినదంతా ఈ చివరి క్షణాలతో పేలవంగా అనిపిస్తుంది.

సాంకేతిక వర్గం:

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు మాత్రం చాలా బాగున్నాయి. మేకర్స్ ఈ సినిమా నేపథ్యానికి ఎలా కావాలో అంతే సహజమైన సెటప్ తో ప్లాన్ చేసుకొని ఒక రూటెడ్ అటెంప్ట్ ని చేశారు. ఇందులో స్మరన్ సాయి సంగీతం బిగ్గెస్ట్ ప్లస్ గా నిలిచింది. తన పాటలు, బ్యాక్గ్రౌండ్స్ స్కోర్ ఇంప్రెస్ చేస్తాయి. సలిగంటి విజయ్ కుమార్ కెమెరా వర్క్ బాగుంది. రోహిత్ పెనుమత్స ఎడిటింగ్ బాగానే ఉంది, దర్శకుడు స్క్రీన్ ప్లేకి తగ్గట్టుగా చేసిన కట్స్ బాగానే ఉన్నాయి కానీ క్లైమాక్స్ పార్ట్ కి వచ్చేసరికి మూమెంట్స్ ని స్లోగా నడిపించడం బాధాకరం.

ఇక దర్శకుడు రమణ రెడ్డి సోమ పనితనం విషయానికి వస్తే.. తాను రొటీన్ కాన్సెప్ట్ నే ఎంచుకున్నా అందులో తాను చెప్పాలనుకున్న పాయింట్ ని మాత్రం బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఇష్టపడి చేసే పని దాని ద్వారా నలుగురికి మంచి జరిగితే వాళ్ళే అమీర్ లోగ్ అంటూ ప్రెజెంట్ చేసిన పాయింట్ బాగుంది. కానీ కొన్ని ప్రొసీడింగ్స్ మాత్రం రొటీన్ గానే ఉన్నాయి. అలాగే క్లైమాక్స్ పోర్షన్ ని ఇంకాస్త బెటర్ గా మార్చాల్సింది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘అమీర్ లోగ్’, ఓ బ్యాచ్ స్నేహితులు కలిసి చూడాలగలిగేలానే ఉంటుంది కానీ కొన్ని మూమెంట్స్ మాత్రం రెగ్యులర్ గానే ఉన్నాయి. అక్కడక్కడా కామెడీ, ఎమోషన్స్ వర్క్ అయ్యాయి. దర్శకుడు చెప్పదలచుకున్న పాయింట్ ముఖ్యంగా ఇందులో ఇంప్రెస్ చేస్తుంది. కానీ ఆ రొటీన్ ఫీల్ సీన్స్, వీక్ క్లైమాక్స్ పార్ట్ డిజప్పాయింట్ చేస్తాయి. సో వీటితో కొంచెం రొటీన్ గా ఉన్నా మీ ఫ్రెండ్స్ బ్యాచ్ తో చూడాలి అనుకుంటే కొంతమేర ఈ సినిమా ఇంప్రెస్ చేస్తుంది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

సంబంధిత సమాచారం

తాజా వార్తలు