ఏ తేదీన పోగొట్టుకున్నాడో అదే డేట్ లో దుమ్ము లేపిన మాస్ మహరాజ్..!

ఏ తేదీన పోగొట్టుకున్నాడో అదే డేట్ లో దుమ్ము లేపిన మాస్ మహరాజ్..!

Published on Aug 21, 2026 5:00 PM IST

మన తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి టాప్ మోస్ట్ ప్రముఖ హీరోస్ లో తమదైన స్టాండర్డ్స్ సెట్ చేసి తరువాత గాడి తప్పిన హీరోస్ లో మాస్ మహరాజ్ రవితేజ కూడా ఒకరు. కారణం ఏదైనా తనకి కొంత కాలం గడ్డు కాలం నడిచింది. అయితే మేజర్ గా తన మార్కెట్ కి దెబ్బ పడింది మాత్రం తన సీక్వెల్ చిత్రం “కిక్ 2” అనే చెప్పాలి. తన కెరీర్లో అదే భారీ హైప్ లో వచ్చిన సినిమా కూడా.

అయితే ఈ సినిమా తర్వాత ఒకటీ రెండు హిట్స్ వచ్చాయి. కానీ న్యూట్రల్ ఆడియెన్స్ దూరం అయ్యారు. అయితే ఆ సినిమా విడుదల అయ్యిన అదే డేట్ నుంచి సరిగ్గా మళ్లీ పదేళ్ల తర్వాత అదే ఆగస్ట్ 21న వచ్చి ఒక ఊహించని కంబ్యాక్ ని రవితేజ కొట్టడం అనేది జస్ట్ గాడ్ థింగ్స్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

కంబ్యాక్ అంటే అది మామూలు లెవెల్లో కూడా కాదు మెగాస్టార్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సినిమా పీక్ హవర్ బుకింగ్స్ ని సైతం క్రాస్ చేసే రేంజ్ కంబ్యాక్ ని తను కొట్టడం విశేషం. సో ఇలా ఎక్కడైతే తను పోగొట్టుకున్నాడో అదే తేదీకి వచ్చి పడిలేచిన కెరటంలా బాక్సాఫీస్ దగ్గర మరోసారి తన స్టామినా చూపించనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు