ట్రైలర్ టాక్ : ఫుల్ ఎనర్టైన్మెంట్ తో ‘రంభ ఊర్వశి మేనక’

ట్రైలర్ టాక్ : ఫుల్ ఎనర్టైన్మెంట్ తో ‘రంభ ఊర్వశి మేనక’

Published on Aug 24, 2026 5:27 PM IST

అల్లరి నరేష్ తన మార్క్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’ చిత్రంతో ప్రేక్షకులను నవ్వించడానికి సిద్ధమయ్యారుడు. కింగ్ నాగార్జున విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులలో అంచనాలను భారీగా పెంచేసింది. అప్సరసలను భూమిపైకి తీసుకువచ్చి తన కోరికలు తీర్చుకోవాలనుకునే ఒక యువకుడి కథ ఇది. దేవేంద్రుడిగా వెన్నెల కిషోర్ మరియు నరేష్ మధ్య నడిచే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తున్నాయి.

​నరేష్ తనదైన కామెడీ టైమింగ్, బాడీ లాంగ్వేజ్, బోయపాటి శ్రీను ఇమిటేషన్ మరియు వాషి-ఓ-వాషి స్పూఫ్‌తో అదరగొట్టారు. రంభ, ఊర్వశి, మేనకలుగా రాశి సింగ్, విష్ణు ప్రియ, ప్రాశి సింగ్ అందంగా కనిపించారు. చంద్రమోహన్ చింతడ అందించిన వినూత్న కథాంశంతో, సెప్టెంబర్ 4న విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకులకు పక్కా వినోదాన్ని పంచనుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు