NBK111 కోసం రెండు టైటిల్స్..?

NBK111 కోసం రెండు టైటిల్స్..?

Published on Aug 24, 2026 6:15 PM IST

NBK111

నందమూరి బాలకృష్ణ తన గాయం నుంచి పూర్తిగా కోలుకున్న వెంటనే ‘NBK 111’ షూటింగ్ సెట్స్‌లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నారు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను డిసెంబర్ 24న థియేటర్లలోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.

బాలకృష్ణ మాస్ ఇమేజ్, డైరెక్టరింగ్ స్టైల్‌కు తగ్గట్టుగా ఈ చిత్రం గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో పవర్‌ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. ​ఈ ప్రాజెక్ట్ కోసం ‘గాడ్’ మరియు ‘దాదా’ అనే రెండు మాస్ టైటిల్స్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ పవర్‌ఫుల్ టైటిల్స్‌లో ఏది ఖరారైనా, బాలయ్య సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయం.

తాజా వార్తలు