సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న లేటెస్ట్ కుటుంబ కథా చిత్రం ‘ఇడుపు కాయితం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ప్రియదర్శి హీరోగా నూతన నటి నాగదుర్గ హీరోన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్నారు.
కాగా నేడు ప్రియదర్శి పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ‘శ్రీలత’ అనే ఫస్ట్ సింగిల్ ప్రోమోను విడుదల చేసి సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ ప్రోమో ప్రియదర్శి, నాగదుర్గల మధ్య సాగే ఒక లవ్ మెలోడీగా అలరిస్తోంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, సరదా సన్నివేశాలు, ప్రియదర్శి హీరోయిన్‌ను కూల్ చేసేందుకు పడే తాపత్రయం ఆకట్టుకునేలా ఉన్నాయి.
సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ పాటకి అల రాజు ఆకట్టుకునే లిరిక్స్ అందించారు. కాగా, పూర్తి పాటను త్వరలోనే విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ త్వరలో రానున్నాయి.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


