మాస్ రాజా ర్యాంపేజ్.. వంద కోట్ల క్లబ్‌లోకి రవితేజ ‘ఇరుముడి’

మాస్ రాజా ర్యాంపేజ్.. వంద కోట్ల క్లబ్‌లోకి రవితేజ ‘ఇరుముడి’

Published on Aug 25, 2026 8:06 PM IST

మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. దర్శకుడు శివ నిర్వాణ డైరెక్షన్‌లో వచ్చిన ఈ డివోషనల్ ఫ్యామిలీ డ్రామా మూవీ వరల్డ్‌వైడ్‌గా ఏకంగా రూ.100 కోట్ల వసూళ్లతో ర్యాంపేజ్ క్రియేట్ చేసింది.

ప్రేక్షకుల నుంచి వచ్చిన అపూర్వ ఆదరణతో ఈ చిత్రం ఈ ల్యాండ్ మార్క్‌ను అందుకుందని మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సినిమాకు వస్తున్న పాజిటివ్ టాక్‌తో థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. భక్తితో కూడిన బలమైన కథాంశానికి రవితేజ మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ తోడవడంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

ఈ గ్రాండ్ సక్సెస్‌తో ‘ఇరుముడి’ టీమ్ ఎంతో ఉత్సాహంగా ఉంది. ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించగా బేబీ నక్షత్ర, సాయి కుమార్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు జీవీ.ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు