గంటలో లక్ష టికెట్ల అమ్మకం.. ‘టాక్సిక్’ తుఫానుకు అల్లాడుతున్న బాక్సాఫీస్..!

గంటలో లక్ష టికెట్ల అమ్మకం.. ‘టాక్సిక్’ తుఫానుకు అల్లాడుతున్న బాక్సాఫీస్..!

Published on Aug 25, 2026 11:01 PM IST

రాకింగ్ స్టార్ యష్ నటించిన మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ విడుదల మరికొద్ది గంటల్లో ఉండటంతో అడ్వాన్స్ బుకింగ్స్ వద్ద సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ యాప్‌లలో కలిపి కేవలం ఒక్క గంటలోనే ఏకంగా లక్ష టిక్కెట్లు అమ్ముడవడం ఈ సినిమాపై ఉన్న అన్‌లిమిటెడ్ క్రేజ్‌ను స్పష్టం చేస్తోంది.

ఈ అద్భుతమైన రెస్పాన్స్ చూస్తుంటే మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి ఓపెనింగ్స్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. కేవిఎన్ ప్రొడక్షన్స్, యష్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రానికి గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ప్రేక్షకులకు ఒక స్పెషల్ మెసేజ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ సినిమా అనుభూతిని కాపాడేలా థియేటర్లలో క్లిప్‌లు రికార్డ్ చేయడం, సోషల్ మీడియాలో స్పాయిలర్స్ లేదా కథను లీక్ చేయడం వంటివి చేయవద్దని.. అందరూ ఈ సినిమాను థియేటర్లలోనే పూర్తిస్థాయిలో ఆస్వాదించాలని మేకర్స్ కోరారు. మరి బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు