అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న అనౌన్స్‌మెంట్ రానే వచ్చింది. కింగ్ నాగార్జున పుట్టినరోజైన ఆగస్టు 29న ఆయన మైల్‌స్టోన్ చిత్రం ‘కింగ్ 100’ కి సంబంధించిన బిగ్ అప్‌డేట్ రాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.
ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని చిత్రబృందం ‘కింగ్ 100 గ్లింప్స్’ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. బాక్సాఫీస్ వద్ద విజయోత్సవాల జోష్ మీదున్న అక్కినేని కాంపౌండ్ నుంచి రాబోతున్న ఈ సినిమా గ్లింప్స్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ గ్లింప్స్‌తో సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ మాత్రమే కాకుండా, డిసెంబర్ రిలీజ్ డేట్‌పై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟐𝟗𝐭𝐡.
A date etched in the hearts of millions.
A day that belongs to one man. 👑This year, we celebrate the KING like never before with the #King100Glimpse on Aug 29th.💥#LongLiveTheKing 🔥❤️#King100 😎
— Annapurna Studios (@AnnapurnaStdios) August 26, 2026


