మన టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా తన భార్య, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు రాహుల్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ పాన్ ఇండియా చిత్రమే ‘రణబాలి’. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా రిలీజ్ ని మొదట సెప్టెంబర్ కి లాక్ చేసిన సంగతి తెలిసిందే. కానీ పలు కారణాలు చేత అక్కడ నుంచి వాయిదా వేశారు.
ఇక కొత్త డేట్ ఎప్పుడు ఏంటి అని అభిమానులు ఎదురు చూస్తున్న నేపథ్యంలో నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఓ పవర్ఫుల్ పోస్టర్ తో రణబాలి కొత్త విడుదల తేదీని అనౌన్స్ చేసేసారు. దీనితో ఈ అవైటెడ్ సినిమా అక్టోబర్ 16న పాన్ ఇండియా వైడ్ గా గ్రాండ్ విడుదలకి తీసుకొస్తున్నట్టుగా ఖరారు చేశారు. ఇక ఈ కొత్త పోస్టర్ లో విజయ్ లుక్ కూడా నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. ఈ చిత్రానికి అజయ్, అతుల్ లు సంగీతం అందిస్తున్నారు.


