
న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’ నుంచి మరో అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమాలోని మోస్ట్ అవేటెడ్ సెకండ్ సింగిల్ “ఎషనాగుల” పాట రాబోతుండటంతో అభిమానుల్లో జోష్ విపరీతంగా పెరిగింది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతంలో వస్తున్న ఈ మాస్ నంబర్ కోసం మ్యూజిక్ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తెలంగాణ ఫోక్ టచ్ ఉన్న ఈ స్పెషల్ సాంగ్‌లో నానితో పాటు నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ కూడా ప్రత్యేకంగా స్టెప్పులేయడం ఈ పాటకే ప్రధాన హైలైట్ కానుంది. అయితే ఈ సాంగ్ ని ఆగస్ట్ 29న ఉదయం 10. 08 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ‘దసరా’ బ్లాక్‌బస్టర్ జోడీ మరోసారి స్క్రీన్‌పై మ్యాజిక్ చేయనుండటం విశేషం. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ సాంగ్ సినిమాపై అంచనాలను మరింత పెంచేయగా, సెప్టెంబర్ 24, 2026న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది.

