ఈ ఏడాది మన టాలీవుడ్ హీరోలు చాలా మంది సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు. అలా ఇచ్చిన వారిలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఒకరు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రితికా నాయక్ హీరోయిన్ గా దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించిన హారర్ కామెడీ డ్రామానే కొరియన్ కనకరాజు. మంచి బజ్ నడుమ వచ్చి ఇది భారీ హిట్ అయ్యింది.
ఇక ఫైనల్ గా థియేటర్స్ నుంచి ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమాని దిగ్గజ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇందులో నేటి నుంచి సినిమా అందుబాటులోకి వచ్చేసింది. తెలుగు సహా పాన్ ఇండియా భాషలు మొత్తం కలిపి 5 భాషల్లో సినిమా అందుబాటులోకి వచ్చేసింది. సో అప్పుడు ఎవరైనా మిస్ అయితే ఇప్పుడు ఈ సినిమాని చూడొచ్చు. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందించాడు. అలాగే యూవీ క్రియేషన్స్ నిర్మాణం వహించారు.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి


