బిగ్ బాస్ 10: ఈసారి సెలబ్రిటీ కంటెస్టెంట్స్ వీరే!?

బిగ్ బాస్ 10: ఈసారి సెలబ్రిటీ కంటెస్టెంట్స్ వీరే!?

Published on Sep 4, 2026 5:04 PM IST

మన తెలుగు స్మాల్ స్క్రీన్ వద్ద బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కోసం అందరికీ తెలిసిందే. గత దశాబ్ద కాలం కితమే మొదలైన ఈ రియాలిటీ షో తెలుగులో సూపర్ హిట్ అయ్యింది. ఇక ఎట్టకేలకు పదవ సీజన్ కి చేరుకున్న ఈ షో కేవలం సెలెబ్రెటీల తోనే కాకుండా సామాన్యులని కూడా హౌస్ లోకి పంపిస్తూ ఎంటర్టైన్మెంట్ లో మసాలా మరింత యాడ్ చేస్తున్నారు.

ఇక లేటెస్ట్ గా ఈసారి కొత్త సీజన్ లో కనిపించే సెలెబ్రిటీ కంటెస్టెంట్ ల తాలూకా పేర్లు ఇప్పుడు తెలుస్తున్నాయి. లేటెస్ట్ సమాచారం ప్రకారం జబర్దస్త్ రామ్ ప్రసాద్, నరేష్, అలాగే కృష్ణుడు, చైత్ర రాజ్, ముఖేష్ గౌడ అలాగే అదితి ఈశ్వరన్ పేర్లు ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. సో వీటిపై అధికారిక క్లారిటీ త్వరలోనే రానుంది. ఇక ఈసారి సీజన్ సెప్టెంబర్ 6న గ్రాండ్ గా లాంచ్ కాబోతోంది. అలాగే కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు