‘కమిటీ కుర్రోళ్లు’ ఫేమ్ ఈశ్వర్‌తో ‘ఎస్ ఆర్ కళ్యాణమండపం’ డైరెక్టర్ కొత్త ప్రాజెక్ట్

‘కమిటీ కుర్రోళ్లు’ ఫేమ్ ఈశ్వర్‌తో ‘ఎస్ ఆర్ కళ్యాణమండపం’ డైరెక్టర్ కొత్త ప్రాజెక్ట్

Published on Sep 8, 2026 6:00 AM IST

​‘ఎస్ ఆర్ కళ్యాణమండపం’ ఫేమ్ దర్శకుడు శ్రీధర్ గాదె కొత్త ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారు. శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ పతాకంపై నిర్మాత వెంకట్ తలారి ఈ చిత్రాన్ని ప్రొడక్షన్ నెం.3గా నిర్మిస్తున్నారు. ఈ పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ దర్శకుడు కోదండరామిరెడ్డి క్లాప్ కొట్టగా, దర్శకుడు వీరభద్రం చౌదరి కెమెరా స్విచ్ఛాన్ చేశారు.

​ఈ చిత్రంలో ‘కమిటీ కుర్రోళ్లు’ ఫేమ్ ఈశ్వర్ రాచి రాజు ప్రధాన పాత్రలో నటిస్తుండగా, నందు, లిఖిత హీరోయిన్లుగా ఎంపికయ్యారు. పూజిత పొన్నాడ, సింధు కాసారం ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

​గ్రామీణ నేపథ్యంలో సాగే సరికొత్త హారర్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌కు సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా, సతీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ వివరాలతో పాటు పూర్తి తారాగణాన్ని త్వరలోనే వెల్లడించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు