‘వారణాసి’ షూట్ పై ఇంట్రెస్టింగ్ బజ్!

‘వారణాసి’ షూట్ పై ఇంట్రెస్టింగ్ బజ్!

Published on Sep 9, 2026 7:00 PM IST

Varanasi

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ లు ప్రధాన పాత్రల్లో గ్లోబల్ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ చిత్రం వారణాసి కోసం అందరికి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతుంది.

ఒకపక్క షూటింగ్ మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుపుకుంటున్న ఈ చిత్రం కి సంబంధించి తమ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు వినిపిస్తుంది. దీని ప్రకారం ఇప్పటివరకు మహేష్ బాబు పై తన ఎంట్రీ సీక్వెన్స్ ని ఇంకా తెరకెక్కించలేదట.

దీంతో ఈ సినిమాకి మిగిలిన షూటింగ్ తో పాటు మహేష్ బాబు ఎంట్రెన్స్ సీక్వెన్ ను కూడా ఈ అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే ఎస్ ఎస్ కార్తికేయ, కే ఎల్ నారాయణ సంయుక్తంగా నిర్మాణం వహిస్తుండగా వచ్చేయడానికి ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్ వర్షన్ లో కూడా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు