ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర రూల్ చేస్తున్న మేజర్ కంటెంట్ లో డివోషనల్ జానర్ సినిమాలు ఎక్కువ కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. అలా రీసెంట్ గా మన తెలుగు నుంచి వచ్చిన ‘ఇరుముడి’ అనే చిత్రాన్ని అయ్యప్ప స్వామి ఫ్యాక్టర్ విపరీతమైన పాజిటివ్ బజ్ ని తీసుకొచ్చేలా చేసింది. ఇక ఈ సినిమా విడుదల అయ్యాక రవితేజ కెరీర్ లో ఎప్పుడూ చూడని ఒక ఎమోషనల్ విజయాన్ని చూసారు.
అయితే బాలీవుడ్ లో కూడా ఓ డివోషనల్ సినిమా ఊహించని విజయాన్ని నమోదు చేసింది. అదే ఇప్పుడు అంతా ఎంతగానో మాట్లాడుకుంటున్న హనుమాన్ అంశ్. దర్శకుడు విశాల్ చతుర్వేది తెరకెక్కించిన ఈ చిత్రం చిన్న విత్తు నుంచి బాక్సాఫీస్ దగ్గర ఓ మహా వృక్షంలా అవతరించింది.
అయితే ఇరుముడి సినిమాకి జరిగినట్టే ఓ ఇంట్రెస్టింగ్ సీన్ హనుమాన్ అంశ్ కి కూడా రిపీట్ అయ్యిందట. ఇరుముడి చిత్రం ఉంది అనుకోని తెలంగాణలోని ఓ ప్రాంతం ప్రజలు థియేటర్ వద్దకి వెళితే తీరా అక్కడ మరో సినిమాని ప్రదర్శితం చేయడంతో ప్రేక్షకులు ఇరుముడి సినిమా తీసేసినందుకు అక్కడే బైఠాయించి ఆందోళన చేసి సినిమా మళ్ళీ వేయాలని డిమాండ్ చేశారు.
సరిగ్గా ఇలాంటి సీన్ నే హనుమాన్ అంశ్ బదులు మీర్జాపూర్ సినిమా రీప్లేస్ చేయడంతో ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ప్రేక్షకులు కూడా హనుమాన్ అంశ్ ని తిరిగి షో వెయ్యాలని నిరసన చేస్తే అది పోలీసులు వరకు కూడా వెళ్లిందట. దీనితో థియేటర్ యాజమాన్యం మళ్ళీ హనుమాన్ అంశ్ ని వేసారట. సో సాలిడ్ కంటెంట్ పడితే ప్రేక్షకుల నుంచి డిమాండ్ ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ రెండు సినిమాలకి వచ్చిన ఆదరణే నిదర్శనం.


