నేచురల్ స్టార్ నాని కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
కాగా, ఈ చిత్ర నైజాం థియేట్రికల్ హక్కులు రికార్డు స్థాయి ధరకు అమ్ముడయ్యాయి. మైత్రి మూవీ మేకర్స్ ఈ హక్కులను ఫ్యాన్సీ రేటుకు దక్కించుకోగా, అందులో 50 శాతం వాటాను తమ వద్ద ఉంచుకుని.. మిగిలిన 50 శాతాన్ని నిర్మాత సుధాకర్ చెరుకూరి (25%), ప్రొడ్యూసర్ నాగవంశీ (25%)లకు పంచుకున్నారు. ‘దసరా’ ఫుల్ రన్ కలెక్షన్ల కంటే అత్యధిక ధరకు ఈ డీల్ కుదరడం విశేషం.
ప్రస్తుతం చివరి దశ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను త్వరలోనే హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. మరోవైపు నాగవంశీ నిర్మాణంలో, వెంకీ అట్లూరి దర్శకత్వంలో నాని తదుపరి చిత్రం ఉండబోతోందని సమాచారం.


