సమీక్ష : హ్యాపీ జర్నీ – అక్కడక్కడా ఓకే అనిపించే లేడీస్ ఫన్ డ్రామా

సమీక్ష : హ్యాపీ జర్నీ – అక్కడక్కడా ఓకే అనిపించే లేడీస్ ఫన్ డ్రామా

Published on Sep 18, 2026 12:07 PM IST

విడుదల తేదీ : సెప్టెంబర్ 18, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : అన్నపూర్ణ, ఆమని, ఝాన్సీ, వంశీ, పాయల్ రాధాకృష్ణ, సునైన, రవి శివతేజ తదితరులు
దర్శకత్వం : అభిరామ్ నాయుడు
నిర్మాతలు : గుత్తా బాలాజీ, గుండాల కౌశిక్ రెడ్డి
సంగీతం : శేఖర్ చంద్ర
ఛాయాగ్రహణం : సుబ్రమణియన్ మణిగందన్
కూర్పు : చోటా కె ప్రసాద్

సంబంధిత లింక్స్ : ట్రైలర్

అభిరామ్ నాయుడు దర్శకత్వంలో రూపొందిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘హ్యాపీ జర్నీ’. అన్నపూర్ణమ్మ, ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, ఆమని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తాజాగా థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథ:

విభిన్నమైన నేపథ్యాలు ఉన్న సావిత్రి (అన్నపూర్ణమ్మ), చాముండేశ్వరి (ఆమని), నయన (జినిషా అలిశెట్టి), శ్రీలత (ఝాన్సీ), తన్వి (పాయల్ రాధాకృష్ణ), దివ్య (సునైన), విహాన (రూప శ్రీనివాస్) అనే మహిళలు లక్కీ డ్రా ద్వారా యూరప్ ట్రిప్ గెలుచుకుని అక్కడికి పయనమవుతారు. ‘గ్రేట్ ఆంధ్రా ట్రావెల్స్’ నడిపే గోవింద్ (వంశీ), అప్పారావు (రవి శివతేజ)లు ఈ ట్రిప్‌కి గైడ్‌లుగా వ్యవహరిస్తారు. సరదాగా సాగే ఒక టూర్.. జీవిత సత్యాలను తెలుసుకోవడానికి, కుటుంబ బంధాలను తిరిగి బలపరుచుకోవడానికి ఎలా ఉపయోగపడింది అనేదే మిగతా కథ.

ప్లస్ పాయింట్స్:

ఒక మంచి ఉద్దేశంతో తెరకెక్కిన చిత్రం ‘హ్యాపీ జర్నీ’. దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం కొంతమంది ప్రేక్షకులకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. టైటిల్‌తోనే ఈ సినిమా ఇచ్చే మెసేజ్ ఏమిటో అర్థమవుతుంది.

రెండు భాగాల్లో ఉన్న కొన్ని ఎంటర్‌టైనింగ్ సీన్స్ బాగానే ఆకట్టుకున్నాయి. వంశీ మరియు ప్రధాన మహిళల మధ్య వచ్చే డైలాగ్స్ నవ్వులు పూయిస్తాయి. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ బాగుంది.

సీనియర్ నటి అన్నపూర్ణమ్మ మోడ్రన్ అవతార్‌లో అలరించగా.. ఆమని, ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, సునైనలు తమ పాత్రల్లో చక్కగా పర్ఫార్మ్ చేశారు. వంశీ తన టైమింగ్‌తో నవ్వించగా, రవి శివతేజతో అతని కెమిస్ట్రీ బాగా కుదిరింది.

మైనస్ పాయింట్స్:

స్క్రీన్‌ప్లే సరిగ్గా కుదరకపోవడం వల్ల ‘హ్యాపీ జర్నీ’ అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కొన్ని అనవసరమైన సన్నివేశాల వల్ల మంచి సీన్ల ఇంపాక్ట్ తగ్గి, సినిమా ఫ్లో దెబ్బతింది. రిపీటెడ్ సీన్లను తగ్గించి ఉంటే బాగుండేది.

సినిమాలో ఉండాల్సిన ఎమోషనల్ డెప్త్ పూర్తిగా పండలేదు. ఒక ఎమోషనల్ రైడ్‌ను అందించాలనుకున్నప్పుడు, హీరోయిన్ల వ్యక్తిగత సమస్యలను ఇంకాస్త వివరంగా చూపించి ఉండాల్సింది.

ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషన్స్‌కి మధ్య బ్యాలెన్స్ సరిగ్గా కుదరలేదు. పాత్రల మధ్య వచ్చే విభేదాలు చాలా త్వరగా సమసిపోవడంతో చివరి ఎపిసోడ్స్ కాస్త హడావుడిగా ముగిసినట్లు అనిపిస్తాయి. దీనివల్ల కొన్ని సన్నివేశాలు కృత్రిమంగా, మరికొన్ని మెసేజ్ ఇచ్చేవిలా మారాయి.

సాంకేతిక వర్గం:

హేమంత్ ధోమే అందించిన కథ బాగున్నా, దానికి బలమైన స్క్రీన్‌ప్లే తోడవ్వాల్సింది. కామెడీ సన్నివేశాలను అభిరామ్ నాయుడు బాగానే తీసినప్పటికీ, కథనాన్ని మరింత బలంగా నడిపించి ఉంటే బాగుండేది. సెకండ్ హాఫ్ ప్రారంభంలో వచ్చే ఒక పాట మినహా, శేఖర్ చంద్ర అందించిన మిగతా పాటలు బాగున్నాయి. సుబ్రమణ్యన్ మణిగండన్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. యూరప్ అందాలను చాలా బాగా చూపించారు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకుంటే.. ‘హ్యాపీ జర్నీ’ అక్కడక్కడా ఓకే అనిపించే ఫన్ డ్రామాగా నిలుస్తుంది. ఇందులో ముఖ్యంగా ఫీమేల్ సెంట్రిక్ పాయింట్, వారితో జెనరేట్ చేసిన ఫన్ అక్కడక్కడా మెప్పిస్తాయి. కానీ కథ, కథనాల్లో కావాల్సిన ఫుల్ ఫ్లెడ్జ్ డెప్త్ మిస్ కావడంతో ఫలితంకి దెబ్బ పడింది. సో చాలా తక్కువ అంచనాలు పెట్టుకుంటే ఈ కామెడీ డ్రామా కనెక్ట్ అవుతుంది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు