‘మండాడి’ చిత్ర బృందాన్ని నటుడు కమల్ హాసన్ ప్రత్యేకంగా కలిసి అభినందించారు. చిత్ర దర్శకుడు మతిమారన్ పుగళేంది, నిర్మాత ఎల్రెడ్ కుమార్, నటులు సూరి, సుహాస్, రవీంద్ర విజయ్‌లతో మాట్లాడిన ఆయన చిత్ర విజయంపై ప్రశంసలు తెలియజేశారు.
కమల్ హాసన్‌ను కలవడం పట్ల నటుడు సూరి స్పందిస్తూ, ఆయన తమ టీమ్‌పై చూపిన ప్రేమ, అందించిన ఆశీస్సులు ఎప్పటికీ గుర్తుండిపోతాయని తెలిపారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. ఈ చిత్ర విజయానికి సంబంధించి ఇప్పటికే రజినీకాంత్ కూడా చిత్ర బృందాన్ని అభినందించారు.
ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై ఎల్రెడ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రంలో సూరి, సుహాస్, మహిమా నంబియార్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల రూపాయల వసూళ్లను సాధించినట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేసింది.


