మెగాస్టార్ చిరంజీవి నుంచి రానున్న చిత్రాల్లో విశ్వంభర అలాగే కాకా రెండు సినిమాలు ఉన్నాయి. ఇక వీటిలో ఆల్రెడీ విశ్వంభర షూటింగ్ అయ్యిపోయింది రిలీజ్ కోసం సిద్ధంగా ఉంది. ఇక దీని తర్వాత స్టార్ట్ చేసిన కాకా సినిమా కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి సిద్ధంగా ఉంది.
అయితే గత కొన్నాళ్ల నుంచి విశ్వంభర, కాకా రెండు సినిమాల విడుదల పట్ల నెలకొన్న సందిగ్ధంపై స్వయంగా మెగాస్టార్ నుంచి కాకా వచ్చే ఏడాది సంక్రాంతికి వస్తుంది అని చెప్పడంతో ఆ సమయానికి విశ్వంభర రాదు అని కన్ఫర్మ్ అయ్యిపోయింది. దీనితో ఈ సినిమా సంగతి ప్రశ్నగా మారింది. ఇక విశ్వంభర సినిమా సంక్రాంతి రేస్ అనే మాట ఉండదు.
సో ఈ ఏడాదిలోనే విడుదల దాదాపు ఉండొచ్చు. నవంబర్ సినిమా ఉండొచ్చని రూమర్స్ ఉన్నాయి. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఏమన్నా వస్తుందేమో చూడాలి. ఇక ఈ చిత్రాన్ని వశిష్ఠ తెరకెక్కించగా అవుట్ పుట్ విషయంలో మాత్రం మేకర్స్ సూపర్ హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈ సినిమా విడుదల ఎప్పుడు ఉంటుందో చూడాలి.


