మెగాస్టార్ మా అందరికీ ఇన్‌స్పిరేషన్ – సందీప్ కిషన్

మెగాస్టార్ మా అందరికీ ఇన్‌స్పిరేషన్ – సందీప్ కిషన్

Published on Sep 26, 2026 1:03 AM IST

యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘సిగ్మా’ గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ తాజాగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో హీరో సందీప్ కిషన్ మాట్లాడిన మాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి గారికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

“నా కెరీర్ ప్రారంభం నుండి మెగాస్టార్ గారే నాకు అతిపెద్ద ప్రేరణ. ఈ రోజు నా సినిమా వేడుకకు ఆయన వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం నాకు మాటల్లో చెప్పలేనంత సంతోషాన్ని ఇస్తోంది” అని సందీప్ ఎమోషనల్ అయ్యాడు. దర్శకుడు జాసన్ సంజయ్ గురించి మాట్లాడుతూ, విజయ్ గారి అబ్బాయి అనే ఇమేజ్ ఉన్నప్పటికీ, తన కష్టంతో, స్పష్టమైన విజన్‌తో ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడని ప్రశంసించారు.

‘సిగ్మా’ ఒక సరికొత్త తరహా హైస్ట్ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రతి ఒక్కరినీ అలరిస్తుందని, విజువల్స్ మరియు యాక్షన్ సీన్స్ థియేటర్లలో ప్రేక్షకులకు గూస్‌బంప్స్ ఇస్తాయని ధీమా వ్యక్తం చేశాడు. అక్టోబర్ 2న థియేటర్లలోకి వస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరించి పెద్ద విజయం అందిస్తారని సందీప్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

తాజా వార్తలు