వారి కోసం ‘వారణాసి’పై జక్కన్న ప్లానింగ్ అదేనా..?

వారి కోసం ‘వారణాసి’పై జక్కన్న ప్లానింగ్ అదేనా..?

Published on Sep 25, 2026 10:58 PM IST

Varanasi

గ్లోబల్ మార్కెట్‌ను ఆకట్టుకునేందుకు భారతీయ చిత్ర పరిశ్రమ కొత్త వ్యూహాలను ఎంచుకుంటోంది. కన్నడ స్టార్ యష్ ‘టాక్సిక్’ చిత్రాన్ని నేరుగా ఇంగ్లీష్‌లో కూడా షూట్ చేసి విదేశీ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ, ఆ వర్షన్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. మరోవైపు రణ్‌బీర్ కపూర్ ‘రామాయణ’ చిత్రం AI లిప్-సింక్ టెక్నాలజీతో నటీనటుల సహజమైన ఎమోషన్స్ దెబ్బతినకుండా ఆంగ్లంలోకి అనువదించే ఆధునిక మార్గాన్ని ఎంచుకుంది.

అయితే దర్శకధీరుడు రాజమౌళి మాత్రం మహేష్ బాబుతో తీస్తున్న ‘వారాణాసి’ చిత్రం కోసం పూర్తి భిన్నమైన శైలిని నమ్ముకున్నారు. తొలుత తెలుగులోనే చిత్రాన్ని విడుదల చేస్తూ, విదేశాల్లో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో ప్రదర్శించనున్నారు. బలమైన కథ, దృశ్యకావ్యం ఉంటే భాషతో సంబంధం లేకుండా ప్రపంచ ప్రేక్షకులు ఆదరిస్తారని విశ్వసించే రాజమౌళి, నిజమైన విజన్ ఉన్న లెజెండరీ డైరెక్టర్ అని మరోసారి చాటిచెప్పబోతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2027, ఏప్రిల్ 7న విడుదల కానుంది.

తాజా వార్తలు