గ్లామర్ బ్యూటీ తాప్సీ చాలా బోల్డ్ గా ఉంటుంది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది. ఐతే, తాను బాలీవుడ్లో అడుగుపెట్టిన తొలి ఏడాదిలోనే బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ‘మథియాస్ బో’తో డేటింగ్ మొదలుపెట్టానని తాప్సీ పన్ను తెలిపింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె తన ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడుతూ.. ‘నేను బాలీవుడ్లో అరంగేట్రం చేసిన ఏడాదే మథియాస్ బోతో పరిచయం అయింది. తనతో డేటింగ్ చేయడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. గతంలో ఎప్పుడూ నాకు ఆ సంతోషం దొరకలేదు. అందుకే, మథియాస్ బోతో డేటింట్ నాకెప్పుడూ స్పెషలే’ అని ఆమె తెలిపింది.
తాప్సీ పన్ను ఇంకా మాట్లాడుతూ.. ‘మథియాస్ను ఎంచుకోవడం పూర్తిగా నా ఛాయిస్. అందుకు నేను గర్వపడుతున్నా. మేం 13 ఏళ్లుగా కలిసున్నాం. తను నా హ్యాపినెస్ కోసం ఏదైనా చేస్తాడు. నన్ను సంతోషంగా ఉంచడం కోసం ఏదైనా త్యాగం చేస్తాడు. అలాగే, మా మధ్య ప్రేమ కంటే ముందు మా మధ్య ఒకరిపై ఒకరికి విపరీతమైన గౌరవం ఉంది’ అని తాప్సీ పన్ను స్పష్టం చేసింది. 2024లో అత్యంత సన్నిహితుల సమక్షంలో తాప్సీ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.


