
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద ఘన విజయాన్ని సాదించింది. ఈ సినిమా ఇప్పటివరకు తెలుగు సినిమాలలో ఏ సినిమా సాదించలేని కలెక్షన్ లను సాదించి రికార్డ్ సృష్టించింది. ప్రస్తుతం ఈ సినిమా 50 రోజుల మార్క్ ను చేరుకొనుంది. ఈ సినిమా ఇంతటి విజయాన్ని సాదించడంతో ఈ సినిమా టీం చాలా సంతోషంగా వున్నారు. ఈ నెల 16తో ఈ సినిమా విడుదలై 50 రోజులు పూర్తవుతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. ఈ సినిమా విడుదలకు ముందే మొదటి సగం ఇంటర్నెట్ ద్వారా విడుదల కావడంతో నిర్వాహకులు చాలా భాధపడ్డారు. కానీ ఇది బాక్స్ ఆఫీసు వద్ద సినిమాపై ఏ మాత్రం ప్రభావాన్ని చూపలేకపోయింది.సమంత, ప్రణిత హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఈ సందర్భంగా ‘అత్తారింటికి దారేది’ సినిమా టీంకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
50 రోజులు పూర్తి చేసుకోనున్న ‘అత్తారింటికి దారేది’
50 రోజులు పూర్తి చేసుకోనున్న ‘అత్తారింటికి దారేది’
Published on Nov 12, 2013 6:48 PM IST
సంబంధిత సమాచారం
- ‘లెనిన్’ నుంచి ఇంకెన్ని సర్ప్రైజులో!
- ‘స్పిరిట్’ వాయిదా పడిందా? సాలిడ్ క్లారిటీ బయటకి
- ‘పెద్ది’ కథ జరిగే సమయం రివీల్.. 24 భారీ సెట్స్ తో ‘రంగస్థలం’ని మించి
- సామ్ ‘మా ఇంటి బంగారం’కి కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- ఓటిటిలోకి వచ్చేసిన ‘వారణాసి’ బ్యూటీ హిట్ సిరీస్ సీజన్ 2.. స్పై, యాక్షన్ థ్రిల్లర్ ఎందులో అంటే
- ‘పెద్ది’ యూఎస్ బుకింగ్స్ కి ముహూర్తం ఖరారు.. గ్రాండ్ ఓపెనింగ్స్ పై కన్ను
- మొత్తానికి నితిన్ మరో కొత్త సినిమా.. రెండో వారం నుంచే మొదలు!
- తారక్ ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్రేజీ టాక్!
- Super Good Films: వరుస ఫ్లాపుల్లో ఉన్న విజయ్‌ని నమ్మిన ఆర్.బీ. చౌదరి.. దళపతి రేంజ్ మార్చేసిన ఆ సూపర్ హిట్స్ ఇవే!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బాలయ్య, కొరటాల ప్రాజెక్ట్ కి ముహూర్తం ఖరారు!?
- వైరల్ వీడియో: భారీ విన్నింగ్ ని ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటున్న దళపతి విజయ్
- ఇది సినిమాకున్న ‘పవర్’ – విజయ్ విక్టరీపై సందీప్ వంగ పోస్ట్ వైరల్!
- ట్విస్ట్: విజయ్ స్థానంలోకి త్రిష ఎంట్రీ?
- NBK 112: బాలయ్య కోసం ఆ ఇద్దరిలో ఒకరు?
- బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్.. ధనుష్ క్రేజ్ తగ్గిందా..?
- విజయ్ కి మహేష్ స్పెషల్ విషెస్..!
- ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చిన LIK..!

