ఇంటర్వ్యూ : నందు – మా లైఫ్ అంతా ఈ సినిమా మీదే పెట్టుకున్నాము !

Published on Feb 6, 2020 5:58 pm IST

నందు హీరోగా వస్తోన్న సినిమా ‘సవారి’. సాహిత్ మోత్కూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కాల్వ నరసింహస్వామి ప్రొడక్షన్స్ పతాకం పై సంతోష్ మోత్కూరి, నిషాంక్ రెడ్డి కుడితి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 7న ఈ సినిమా విడుదలవుతోంది. కాగా ఈ సందర్భంగా నందు మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం…

 

‘సవారి’ ఎలా స్టార్ట్ అయింది ?

నేను సెకెండ్ హీరోగా చాల సినిమాలు చేశాను. అలాగే ఈ సినిమాలో కూడా నన్ను మొదట సెకెండ్ హీరోగానే అనుకున్నారు. ఆ సమయంలో మా డైరెక్టర్ సాహిత్ మోత్కూరిగారితో మాట్లాడుతున్న సమయంలో ఇంకా ఈ సినిమాలో హీరోని ఫిక్స్ అవ్వలేదని చెప్పారు. కానీ, నన్ను హీరోగా తీసుకోవాలనుకోలేదు. నేనే ఆయనకు మెసేజ్ చేశాను. నేను హీరో రోల్ లో సూట్ అయితే నేను చేస్తానని అడిగాను. ఆయన నన్ను ఆడిషన్ చేశాక హీరోగా నన్ను తీసుకున్నారు.

 

ఈ సినిమాలో మీ పాత్ర గురించి ?

ఒక స్లమ్ ఏరియాలో ఉంటూ ఒక పూట భోజనం చేస్తూ ఒక గుర్రాన్ని తోలుకునే వాడి క్యారెక్టర్ ను నేను ఈ సినిమాలో చేసాను. ఈ క్యారెక్టర్ లో ఒక్క ఫ్లేవర్ ఉంది. ఒక విధంగా చాల ఎడ్డోడు. నా క్యారెక్టర్ కొత్తగా ఉంటుంది.

 

సినిమాలో ఆఫ్ న్యూడ్ గా చేసినట్టు ఉన్నారు ?

సినిమాలోని ఒక సీన్ ను బట్టే అల కనిపించాల్సి వస్తోంది. నిజం చెప్పాలంటే ఆ సీన్ గురించి డైరెక్టర్ చేపినప్పుడు నేను చాల ఎగ్జైట్ అయ్యాను. ఎప్పటి నుంచో ఏదైనా కొత్తగా చెయ్యాలని అనుకున్న టైంలో నాకు ఈ క్యారెక్టర్ వచ్చింది. అందుకే ఆ క్యారెక్టర్ కి నా వంతుగా పూర్తి న్యాయం చేయటానికి ప్రయత్నం చేశాను. న్యాయం చేశాను అనుకుంటున్నాను.

 

మీరు చాల చిన్న సినిమాల్లో సోలో హీరోగా చేశారు. అస్సలు వర్కౌట్ కాని అలాంటి సినిమాలు ఎందుకు చేశారు ?

అవ్వన్ని అవసరం కోసమే చేశాను. అయితే నేను చేసిన ప్రతి సినిమా విషయంలో ఆ సినిమా బాగా రావడానికి నేను చాల ట్రై చేశాను. కానీ నా చేతుల్లో ఏమి లేదు. నేను ఒక లెవల్ వరకే చెప్పగలను కదా. అయితే నేను ఇప్పటివరకూ చేసిన ప్రతి సినిమా నాకు చాల నేర్పించింది.

 

మీ నేపథ్యం గురించి ?

నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే. అయితే అమ్మవాళ్లది తెనాలి. ఆ రకంగా రెండు తెలుగు రాష్ట్రాలతో నాకు మంచి అనుబంధం ఉంది.

 

ఈ సినిమాలో ఏ అంశాలు హైలైట్ గా ఉంటాయి ?

హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ అండ్ వారి మధ్య ఎమోషన్ హైలైట్ గా ఉంటాయి. మెయిన్ గా హీరో క్యారెక్టర్ కి హీరోయిన్ క్యారెక్టర్ కి మధ్య ఉన్న పూర్తి వ్యత్యాసం చాల బాగుటుంది. ఇక మా సినిమాలోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. మరి సాంగ్స్ హిట్ అయితే సినిమా కూడా హిట్ అవుతుంది అంటారు. మా సినిమా కూడా హిట్ అవుతుందని నమ్ముతున్నాను.

 

దర్శకుడు సాహిత్ మోత్కూరి గురించి ?

సాహిత్ ను కలిసిన మొదటి రోజు నుంచీ మా ఇద్దరి మధ్య ఒక మంచి బాండింగ్ ఏర్పడింది. మా ఇద్దరి మధ్య వేవ్ లెంగ్త్ కూడా బాగా కుదిరింది. ఇక తను పూర్తి వర్క్ హాలిక్ అండి. పనిలోకి వెళ్లిపోతే ఇక పక్కన ఏమి జరుగుతున్నా పట్టించుకోడు. ఈ సినిమా కోసం తను చాల కష్టపడ్డాడు.

 

ఈ సినిమా పై మీరు చాల నమ్మకం పెట్టుకున్నట్లు ఉన్నారు ?

అవును అండి. మా డైరెక్టర్ కి మరియు నాకు ఈ సినిమా చాల ఇంపార్టెంట్. మా లైఫ్ అంతా ఈ సినిమా మీద పెట్టుకున్నాము. నేను ఇండస్ట్రీకి వచ్చి 13 సంవత్సరాలు అయింది. ఈ మధ్యలో చాల అవమానాలు ఫేస్ చేశాను. ఇప్పటివరకూ నాకు హీరోగా కరెక్ట్ సినిమాలు రాలేదు. ఫైనల్ గా ఈ సినిమా వచ్చింది. పెద్ద సక్సెస్ రావాలి అని కోరుకుంటున్నాను.

 

హీరోగా మీ తదుపరి సినిమా గురించి ?

ఒక సినిమా చేస్తున్నాను అండి. ఆ సినిమా డైరెక్టర్ కూడా షార్ట్ ఫిల్మ్ మేకరే. అయితే సవారీ సినిమా రిలీజ్ అయిన తరువాత ఆ సినిమాని అధికారికంగా ప్రకటిస్తాము.

సంబంధిత సమాచారం :