ఇంటర్వ్యూ : అనసూయ భరద్వాజ్ – 12 కథల్లో కథనమే నచ్చింది !

ఇంటర్వ్యూ : అనసూయ భరద్వాజ్ – 12 కథల్లో కథనమే నచ్చింది !

Published on Aug 8, 2019 5:28 PM IST

రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో అనసూయ భరద్వాజ్, అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం “కథనం”. క్రైమ్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సందర్భంగా అనసూయ భరద్వాజ్ మీడియాతో మాట్లాడారు. మరి సినిమా గురించి అనసూయ భరద్వాజ్ వెల్లడించిన పలు ఆసక్తికర విశేషాలు అనసూయ మాటల్లోనే..

మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎన్నాళ్ళవుతుంది ?

దాదాపు నేను ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. అయితే ఎప్పుడూ ఇలా ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో లీడ్ రోల్ లో చేస్తానని నేనెప్పుడూ అనుకోలేదు. నేను ఎంబీఏ చదివి జాబ్ చేస్తున్నప్పుడు పెళ్లి కుదరడంతో ఉద్యాగానికి బ్రేక్ ఇచ్చి ఖాళీగా ఉన్న సమయంలో ఒక యాడ్ చేసి ప్రయత్నించడం జరిగింది. ఆలా అనుకోకుండానే ఇండస్ట్రీకి వచ్చేశాను.

 

 

కధనం చిత్రంలో మీదే ప్రధాన పాత్ర, అన్నప్పుడు ఎలా అనిపించింది?

నిజానికి నేను అంతగా ఎగ్జైట్ కాలేదు. ఎందుకంటే ‘రంగస్థలం’ చిత్రం తరువాత నేను దాదాపు 12 కథల వరకూ విన్నాను. అందులో కథనం స్క్రిప్ట్ నచ్చడంతో దీనికి ఒప్పుకోవడం జరిగింది.

 

 

అంతగా ఈ సినిమాలో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశాలు ఏమిటి ?

అను అనే క్యారెక్టర్ లో ఈ సినిమాలో నటించాను. తను ఒక అసిస్టెంట్ డైరెక్టర్. తాను రాసుకున్న ఒక స్క్రిప్ట్ ప్రకారమే సినిమాలో మర్డర్స్ జరుగుతాయి. ఆ మర్డర్స్ పై జరిగే విచారణ బాగా ఇంట్రస్ట్ గా ఉంటుంది.

 

 

సినిమాకి ఎక్కువుగా మీరే ప్రమోషన్స్ చేస్తున్నారు ?

సినిమాలో నేను తప్ప ఇంకెవ్వరూ లేరు కదా. పైగా మెయిన్ లీడ్ నేనే. అయినా మేం ఎన్ని ప్రమోషన్స్ చేసే ప్రయత్నం చేసినా.. ప్రేక్షకులు థియేటర్ వచ్చేవరికే.. సినిమా బాగుంటేనే హిట్ అవుతుంది. అయితే ఓ మంచి కథని నమ్మి మేం ఈ సినిమా చేశాం.

 

 

దర్శకుడు రాజేష్ నాదెండ్ల గురించి ?

రాజేష్ నాదెండ్లది ఇది ఫస్ట్ ఫిల్మ్. సినిమా పై తనకు మంచి క్లారిటీ ఉంది. నా కోసమే ఈ సినిమా కథ తాను రాసాడేమో అనిపిస్తోంది. తనకి ఈ సినిమా మంచి హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను.

 

 

నాగార్జున సినిమాకి పోటీగా మీ సినిమా వస్తోంది ?

అంత లేదండి. నాగార్జునగారి సినిమాకి మా సినిమా పోటీనా..? నిజానికి మాది చాల చిన్న సినిమా. అసలు చిన్న సినిమాలకు థియేటర్స్ దొరకడమే కష్టం. అలాంటి పరిస్థితుల్లో మా సినిమా విడుదలకు రేపు కుదిరింది. అంతేగాని మీరన్నట్లు పోటీ లాంటివి ఏమి లేదు.

 

 

మీకు తెలుగులో కాకుండా మిగిలిన ఇండస్ట్రీల నుండి కూడా ఆఫర్స్ వచ్చాయట ?

అవునండి. రంగస్థలం డబ్బింగ్ వర్షన్ కన్నడ, తమిళ్ అండ్ మళయాళంలో రిలీజ్ అయ్యాక అక్కడ నుండి చాల అవకాశాలు వచ్చాయి. కానీ నేనే చెయ్యలేకపోయాను.

 

 

మీ తదుపరి సినిమాల గురించి ?

అక్టోబర్ లో మరో సినిమా రిలీజ్ కి సంబంధించి అప్ డేట్ వస్తోంది. అలాగే ఓ సినిమాలో కూడా యాక్ట్ చేస్తున్నాను. అయితే కథనం సినిమా రిలీజ్ తరువాతే మిగిలిన సినిమాల గురించి ఆలోచిస్తాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు