ఇంటర్వ్యూ : శ్రవణ్ రెడ్డి -‘డర్టీ హరి’లో బోల్డ్ కథను బట్టే ఉంటుంది !

ఇంటర్వ్యూ : శ్రవణ్ రెడ్డి -‘డర్టీ హరి’లో బోల్డ్ కథను బట్టే ఉంటుంది !

Published on Dec 14, 2020 6:21 PM IST

ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డర్టీ హరి’. శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహాని శర్మ ఇందులో హీరో హీరోయిన్లు. ఎస్.పి.జె క్రియేషన్స్ పతాకంపై గూడూరు శివరామకృష్ణ సమర్పణలో గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్ మరియు హై లైఫ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై కేదార్ సెలగంశెట్టి , వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 18 న ఫ్రైడే మూవీస్ ఆన్ లైన్ ATT ద్వారా ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రవణ్ రెడ్డి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు మీ కోసం..

 

ముందుగా మీ గురించి చెప్పండి..? నటన వైపు ఎలా వచ్చారు ?

యాక్టింగ్ చిన్నప్పటి నుండి ఇంట్రస్ట్. పైగా నేను పదమూడు ఏళ్ల వయసు నుండి బాంబేలోనే ఉంటున్నాను. అక్కడ ఎన్నో టీవీ షోలు చేశాను. అలాగే వెబ్ సిరీస్ లు కూడా చేసాను. ఆ తరువాత అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా రెండు సినిమాలు చేయడం జరిగింది. ఆ టైంలో యాక్టింగ్ కి నాలుగు సంవత్సరాల గ్యాప్ ఇచ్చాక.. 2014 నుండి మళ్ళీ యాక్టింగ్ స్టార్ట్ చేసి కంటిన్యూ చేస్తున్నాను. నేను తెలుగు అబ్బాయినే.

 

హిందీ టీవీ షోలు, వెబ్ సిరీస్ ల్లో బిజీగా ఉన్న మీరు డర్టీ హరిగా ఎలా మారారు ?

2019లో ఓ వెబ్ సిరీస్ చేశాను అండి. ఆ సిరీస్ లో నన్ను చూసి రాజుగారు ఈ సినిమాకి తీసుకోవడం జరిగింది. నేను డర్టీ హరి పాత్రకు పర్ఫెక్ట్ గా సూట్ అవుతున్నానని ఆయన నన్ను హరిగా సెలెక్ట్ చేశారు. నిజానికి అప్పటికీ నెను తెలుగు అబ్బాయినే అని ఆయన తెలియదు, నాకు తెలిసి ఆ తరువాతే తెలిసిందనుకుంటా.

 

నిర్మాతగా ఎం.ఎస్.రాజుగారికి ఎంతో అనుభవం ఉంది. ఆయనతో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది ?

రాజుగారితో కలిసి చేయబోతున్నాం అనగానే నేను సర్ ప్రైజ్ ఫీల్ అయ్యాను. చిన్నప్పటి నుండి ఆయన నిర్మించిన భారీ సినిమాలు ఒక్కడు, దేవి పుత్రుడు ఇలాంటి సినిమాలు చూస్తూ పెరిగాను. అలాంటి ఆయన యూత్ ను దృష్టిలో పెట్టుకుని ఒక కథ రాయడం, ఆయన రాసిన ఈ ‘డర్టీ హరి’ స్క్రిప్ట్ విన్నాక షాక్ అయ్యాను. ఆయన నుండి ఇంట ట్రెండీ స్క్రిప్ట్ రావడం నిజంగా గొప్ప విషయమే.

 

కానీ ఈ మూవీ బాగా బోల్డ్ గా ఉన్నట్లు ఉంది కదా ?

మీరు సినిమా చూసాక కచ్చితంగా ఆ మాట అనరు అండి. నిజమే, సినిమాలో బోల్డ్ ఉంది.. అయినప్పటికీ.. కథలో నుండే బోల్డ్ వస్తోంది. అసలు కథను బట్టి ఎలాంటి ఎమోషన్ వచ్చినా.. దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తాము. ఈ సినిమాలో మీరు బోల్డ్ యాక్సెప్ట్ చేస్తారు. అంతేగాని బోల్డ్ కావాలని ఏదో పెట్టింది కాదు. ఈ విషయం సినిమా చూసాక మీకు అర్ధం అవుతుంది.

 

సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి ?

నా పాత్ర గ్రే క్యారెక్టర్ అండి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఏమి సిగ్గు లేకుండా ఎలాంటి భయం లేకుండా.. అలాగే మనం రియల్ లైఫ్ లో ఎలా ఉంటామో.. అలాగే రాజుగారు హరి క్యారెక్టర్ ను రాసుకున్నారు. ప్రతి ఒక్కరికి నా క్యారెక్టర్ బాగా కనెక్ట్ అవుతుంది.

 

ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన సిమ్రాన్ గురించి ?

నిజానికి తను కూడా ఈ సినిమాలో అనుకోకుండా జాయిన్ అయింది. తను చాల బాగా నటించింది. ఆ క్యారెక్టర్ ను అర్ధం చేసుకుని తను ఆ పాత్రకు తగట్లు లుక్స్ మారుస్తూ మంచిగా నటించింది.

 

ఈ సినిమా అవుట్ ఫుట్ ఎలా వచ్చింది ?

అనుకున్న దానికంటే అద్భుతంగా వచ్చింది. సినిమా చూశాకా మాకు బాగా నచ్చింది. నమ్మకం కూడా బాగా పెరిగింది. ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది.

 

తెలుగులో ఫస్ట్ టైం సినిమా చేస్తున్నారు. ఎలా ఉంది ?

చాల థ్రిల్లింగ్ అనిపిస్తోంది. ఇప్పటివరకూ చాల చేశాను. కానీ తెలుగులో.. అది డైరెక్ట్ తెలుగు సినిమాలో హీరోగా నటిస్తున్నాను. చాల బాగుంది.

 

సినిమాలో బోల్డ్ సీన్స్ లో నటించడానికి ఎన్ని టెక్స్ తీసుకున్నారు ?

బోల్డ్ సీన్స్ అన్ని మేజర్ షూట్ అయిపోయాక చేశాము. అప్పటికే అందరికి ర్యాపొ వచ్చింది కాబట్టి.. ఎక్కువ టెక్స్ తీసుకోలేదు. నాకు తెలిసి సినిమాలో ఒక్క సీన్ ఉంటుంది.. ఆ ఒక్క సీన్ కే ఎక్కువ టెక్స్ తీసుకున్నాము.

 

ఫస్ట్ మూవీ నెగిటివ్ ఇమేజ్ వస్తోందేమో అనే భయం ఉందా ?

అలా ఏమి లేదు అండి. నాకు అర్ధం అయింది.. ఏంటంటే.. ప్రేక్షకులు ఏదైనా రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు.

 

మీ తరువాత ప్రాజెక్ట్స్ గురించి ?

హిందీలో మేజర్ ప్లాట్ ఫామ్ కి ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను. అలాగే తెలుగులో కూడా మరో సినిమా ఉంది. అది ప్రస్తుతం చర్చలు దశలో ఉంది. చూడాలి ఎప్పుడు స్టార్ట్ అవుతుందో.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు