ప్రత్యేక ఇంటర్వ్యూ : చైతన్య కృష్ణ – శ్యాం ప్రసాద్ రెడ్డి గారి వల్లే సినిమాల్లోకి వచ్చాను

ప్రత్యేక ఇంటర్వ్యూ : చైతన్య కృష్ణ – శ్యాం ప్రసాద్ రెడ్డి గారి వల్లే సినిమాల్లోకి వచ్చాను

Published on Sep 20, 2012 8:00 AM IST


వెన్నెల 1 1/5 చిత్ర టీం ఇంటర్వ్యూలో భాగంగా ఈ రోజు ఈ చిత్ర హీరో చైతన్య కృష్ణతో ప్రత్యేకంగా ముచ్చటించడం జరిగింది. స్నేహగీతం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన చైతన్య నిన్ను కలిసాక, అది నువ్వే సినిమాల్లో సోలో హీరోగా కనిపించి ఆ తరువాత అలా మొదలైంది, రౌద్రం సినిమాల్లో చిన్న పాత్రలు చేసాడు. వెన్నెల 1 1/5 సినిమాలో ఫుల్ లెంగ్త్ హీరోగా కనిపించబోతున్న చైతన్య చెప్పిన ముచ్చట్లు మీకోసం.

1. ఫుల్ గెడ్డంతో కొత్త అవతారంలో కనిపిస్తున్నారు ఏంటి విశేషం?
స : నవ్వుతూ .. నా నెక్స్ట్ సినిమా కాళిచరణ్ కోసం ఈ గెటప్.

2. మీ సినిమా విడుదలకి సిద్ధమైంది. నెర్వస్ గా ఫీలవుతున్నారా?
స: అలాంటిదేమీ లేదు. సినిమా మీద పూర్తి నమ్మకంతో ఉన్నాను. ఎందుకంటే సినిమా చాలా బాగా వచ్చింది కాబట్టి. మేం కష్టపడిన దానికి తగిన ప్రతిఫలం వస్తుందని ఆశిస్తున్నా.

3. ఇండస్ట్రీ వరకు రావడానికి మీ జర్నీ ఎలా సాగింది?
స: ఈ సినిమాకి ముందు నేను కొన్ని సినిమాలు చేశాను కాని ముందుగా ప్రత్యేకంగా థాంక్స్ చెప్పుకోవాల్సింది శ్యాం ప్రసాద్ రెడ్డి గారికి. ఆయన ఈటీవీలో నిర్వహించిన డీ ప్రోగ్రాం ద్వారా నేను పలువురి దృష్టిలో పడటం జరిగింది. ఆ తరువాత తమ్మారెడ్డి భరద్వాజ గారి ద్వారా మధుర శ్రీధర్ డైరెక్షన్లో స్నేహ గీతం సినిమాలో అవకాశం వచ్చింది. ఆ తరువాత నిన్ను కలిసాక, అది నువ్వే, అలా మొదలైంది ఇప్పుడు వెన్నెల 1 1/5 చేసాను.

4. వెన్నెల 1 1/5 సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది?
స: ఈ సినిమాలో నేను లవ్ గురు క్యారెక్టర్ చేసాను. ఎవరైనా లవర్స్ విడిపోవాలనుకుంటే వారి మధ్య గొడవలు పెట్టి విడగొట్టే టైపు అన్నమాట. పూర్తి ఫన్నీగా ఉంటుంది. సినిమాలో మీరు బాగా ఎంజాయ్ చేస్తారు.

5: మీరు స్వతహాగా మంచి డాన్సర్ కదా ఈ సినిమాలో డాన్సు బాగా ఎంజాయ్ చేసారా మరి?
స: చిన్నప్పటి నుండి డాన్స్ అంటే బాగా ఇష్టం. డీ ప్రోగ్రాంలో విన్నర్ గా నిలవడం అటు నుండి సినిమాల్లోకి రావడం అంత డాన్స్ వల్లే జరిగింది. ఈ సినిమాలో ఒక పబ్ సాంగ్లో డాన్సు బాగా ఎంజాయ్ చేసాను.

6: వెన్నెల కిషోర్, మోనాల్ గజ్జర్ తో కలిసి పని చేయడం ఎలా అనిపించింది?
స: వెన్నెల కిషోర్ బాగా సరదా మనిషి. డైరెక్టర్ కదా అని సీరియస్ గా ఉండకుండా చాలా సరదాగా ఉండేవాడు. షూటింగ్ సమయంలో కూడా అందరి మీద జోకులు వేస్తూ బాగా నవ్వించే వాడు. మోనాల్ గజ్జర్ తో కల్సి పని చేయడం నైస్ ఎక్స్పీరిఎన్స్. తన పని చేసుకుంటూ వెళ్ళిపోయేది.

7: ఈ సినిమాలో మెయిన్ హైలెట్స్ ఏమిటి?
స: మాస్టర్ భరత్ కామెడీ ఈ సినిమాలో మెయిన్ హైలెట్. వెన్నెల కిషోర్ డైరెక్షన్, సునీల్ కశ్యప్ మ్యూజిక్ అన్ని సినిమాకి హైలెట్స్. ఇంటర్వెల్లో వచ్చే లైవ్ ఇంటర్వల్ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను.

8: మీరు చేయబోయే నెక్స్ట్ సినిమాలు ఏమిటి?
స: ప్రస్తుతం కాళిచరణ్ అనే సినిమా చేస్తున్నాను. 1980 నేపధ్యంలో జరిగిన కథ ఆధారంగా ఈ సినిమాని తీస్తున్నాము. ఈ సినిమా కోసం గెటప్ మార్చడం వల్ల వేరే ఏ సినిమాలు అంగీకరించలేదు.

అనువాదం : అశోక్ రెడ్డి

Click Here For Interview in English

 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు