ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ : సుమ

Published on Aug 15, 2020 7:06 pm IST

 

ఈ కరోనా భయానక సమయంలో కూడా మీరు నాన్ స్టాప్ గా పని చేస్తున్నారు. భయమేయ్యట్లేదా?

భయం ఉంది, కానీ దానికి తగ్గట్టుగా ఇప్పుడు నన్ను నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఒక కప్పు ఆపిల్ జ్యూస్ మరియు వాటర్ తో నా దినచర్య మొదలవుతుంది. అలాగే ప్రతీ రోజు యోగా చేస్తాను, అలాగే మల్టీ విటమిన్ టాబ్లెట్స్, ఆకు కూరలు తీసుకుంటున్నాను. ఇలా నా ఇమ్యూనిటీని పెంచుకుంటున్నాను. అలాగే ఎపిసోడ్ బ్రేక్ లో ఆవిరి పట్టడం, వేడి నీటిని పుక్కిలించడం వంటివి చేస్తూ ఇంటికి వచ్చాక ఎవరినీ కలవకుండా మొదట స్నానం చేస్తాను.

 

ఈ లాక్ డౌన్ మీకేం నేర్పింది? ఎలా గడిపారు?

కాలం ఎప్పుడు సవాలుతో కూడుకున్నది,నేను నా కెరీర్ కోసం నా షోలతో పరుగులు తీస్తున్నాను. కానీ ఈ లాక్ డౌన్ తో నాకంటూ నేను కూడా కొంత సమయం కేటాయించుకోవాలని అర్ధం చేసుకున్నాను. ఈ లాక్ డౌన్ సమయంలోనే రాజీవ్ తల్లి చనిపోవడంతో వ్యక్తిగతంగా మా కుటుంబానికి తీరని లోటు వచ్చింది.ఇది మినహాయిస్తే నేనెప్పుడూ కూచిపూడి నేర్చుకోవాలి అనుకునేదానిని అది ఈ లాక్ డౌన్ లో ఆన్లైన్ లో నేర్చుకున్నాను. అలాగే టీవీ చాలా ఎక్కువగా చూసేసాను. ఎంతలా అంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ మనీ హేస్ట్ సిరీస్ లు అన్ని చూసెయ్యడమే కాకుండా బాగా తినడంతో పాటుగా కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడిపాను.

 

ఆహా లో ప్లాన్ చేసిన మీ ఓటిటి షో ఆల్ ఈజ్ వెల్ కోసం ఏమన్నా చెప్పండి

ఆహా లో చేసిన నా మొదటి షో పై చాలా ఆశలు పెట్టుకున్నాను. మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా ద్వారా చాలా విషయాలు మారుతాయి అనిపిస్తుంది. తక్కువ సమయంలోనే ఎక్కువ సబ్ స్క్రైబర్స్ ను వారు అందుకున్నారు, అంతే కాకుండా మంచి కంటెంట్ ను కూడా వారు అందిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆహా ఖచ్చితంగా మరింత సక్సెస్ అవుతుంది.

 

మీరు ఎక్కువ చాలా మంది సెలెబ్రెటీస్ ను నేరుగా కలుస్తుంటారు,మరి ఈ వర్చ్యువల్ ఇంటర్వ్యూ ఎలా అనిపిస్తుంది?

టెక్నాలజీ చాలా విషయాలను ఎంతో మార్చేసింది. కానీ మనలాంటి వారి పనికి మాత్రం అది అడ్డుకోలేదు. ఇప్పుడు చాలా మంది సెలబ్స్ తో నేరుగా ఇంట్రాక్ట్ కాకుండా ద్వారానే మాట్లాడుతున్నాను, బహుశా ఇక భవిష్యత్తులో కూడా ఇదే కొనసాగుతుంది అనిపిస్తుంది.

 

మళ్ళీ మీ కొత్త సో స్టార్ మహిళ కోసం ఏమన్నా చెప్పగలరా?

ఇప్పటి వరకు చాలా సీజన్లు చేసాం, మొత్తానికి మళ్ళీ కొత్త సీజన్ తో తిరిగి వచ్చాం. ఈ షో నాకు వ్యక్తిగతంగా బాగా కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు స్టార్ట్ చేసిన కొత్త ఈ ఆగష్టు 17 నుంచి మొదలు కానున్న ఈ షోలో పాల్గొన్న మహిళలతో వ్యక్తిగతంగా కూడా మాట్లాడి వారి జీవనం కోసం అడిగి మాట్లాడాను.

 

మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ తో మీకున్న అనుబంధం?

అది చాలా సూపర్ స్మూత్ లాంటిది అండి. టెలివిజన్ రంగం అంతా ఒక వైపు అలా కొనసాగుతుంటే ఆ సమయంలో మల్లెమాల తో శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఎంటర్ అయ్యి ఒక సరికొత్త ట్రెండ్ ను సెట్ చేసారు. అందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. టెలివిజన్ ఇండస్ట్రీను ఆయన వేరే లెవెల్ కు తీసుకెళ్లి ఆయన షోలతో నాకు కూడా లైఫ్ ఇచ్చినవారు అయ్యారు.

 

ఇప్పుడు రాజీవ్ కనకాల గారు చేస్తున్న పరిణితి చెందిన పాత్రల కోసం ఏమన్నా చెప్తారా?

రాజీవ్ ఒక అద్భుతమైన టాలెంట్ కలిగిన నటుడు. ఈ ఓటిటి ప్లాట్ ఫామ్ తో ఆయన మరిన్ని బెస్ట్ రోల్స్ ను అందుకుని చేస్తున్నారు. ఆయన నటన పరంగా కానీ ప్రతిభ పరంగా కానీ నేను చాలా కాన్ఫిడెంట్ గాను హ్యాపీగా ఉన్నాను.

 

మీ అబ్బాయ్ రోషన్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తాడా?

తను ఇప్పటికే ఒక చిత్రంలో నటించాడు. అలాగే ఖచ్చితంగా ఇండస్ట్రీలోకి వస్తాడు. అలాగే ఇంకా అందుకు రెండేళ్లు ఉంది. మరి ఈ లోపు తనకి ఏ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఉందో నాకు కూడా తెలీదు.

 

ఇక ఫైనల్ గా..ఇన్నేళ్ల గడిచినా మిమ్మల్ని నడిపిస్తుంది ఏంటి?

నేనెప్పుడూ దేన్నైనా ఎదుర్కోడానికి సిద్దపడతాను వెనకడుగు వెయ్యాలి అనుకోను,కొత్త సెలెబ్రెటీలను కలవడం, కెమెరా ముందు ఉండి నా షోలు చేయడాన్ని నేను ఇష్టపడతాను. అలాగే నేను మనసులో ఏదో ఉంచుకొని బయటకు ఒకలా కనిపించే యాటిట్యూడ్ తో కాకుండా ఎప్పుడు నా పాజిటివ్ యాటిట్యూడ్ నన్ను నడిపిస్తుందని భావిస్తాను. నాకు ఉండాల్సిన లోటు పాట్లు ఉన్నాయి. కానీ నేను కోరుకున్న జీవితాన్ని కొనసాగించాలి అన్న నా చర్యలే నన్ను ఇన్నాళ్లు నడిపించాయి.

ఈ విధంగా సుమ గారితో ఇంటర్వ్యూ ను ముగించాం. అలాగే ఆమె సరికొత్త షో మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము.

సంబంధిత సమాచారం :

More