ఈ వారం థియేటర్స్ లో సందడి చేసేందుకు వస్తున్న అవైటెడ్ చిత్రాల్లో రోషన్ మేక హీరోగా దర్శకుడు ప్రదీప్ అద్వైతం తెరకెక్కించిన చిత్రం ‘ఛాంపియన్’ కూడా ఒకటి. మంచి బజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమాని వైజయంతి మూవీస్ వారు తీసుకొస్తుండగా కావాల్సినంత బజ్ ని ఈ సినిమా సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు ప్రదీప్ అద్వైతం ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో ఎలాంటి విశేషాలు పంచుకున్నారో చూద్దాం.
ఈ సినిమా విషయంలో డైరెక్టర్ గా మీకు ఛాలెంజింగ్ గా అనిపించినా ఎలిమెంట్స్ ఏమిటి ?
ప్రొడక్షన్ సపోర్ట్ ఉన్నప్పుడు చాలెంజ్ ఏమీ ఉండదు. మది గారు మిక్కీ జే మేయర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు ఇలా ఒక అద్భుతమైన టీంని ఇచ్చారు. ఎంతో నమ్మకం పెట్టారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే రియల్ ఛాలెంజ్.
రోషన్ ఈ సినిమా కోసం ఎలా కష్టపడ్డాడు?
చాలా సిన్సియర్ యాక్టర్. తన లోపల కష్టపడే తత్వం ఉంది. తన మెచ్యూరిటీ చూస్తే మనకు షాక్ అనిపిస్తది. ఒకసారి కథ విని నచ్చిన తర్వాత మరోసారి ఆలోచించలేదు. తనని చూస్తే నిజంగా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది.
తెలంగాణ సాయుధ పోరాటం ఆధారంగా ఇదివరకు కొన్ని సినిమాలు వచ్చాయి కదా.. ఈ సినిమా ఎంత ప్రత్యేకంగా ఉండబోతుంది?
ఒక హిస్టారికల్ ఈవెంట్ ని సినిమాటిక్ గా ఇంట్రెస్టింగ్ గా చెప్పాలనే ప్రయత్నం చేశాం. సినిమా చూసిన వాళ్ళు ఇలా జరిగిందని తెలుసుకుంటే మేము చేసిన ప్రయత్నం సఫలమైనట్టే. మనం పుట్టిన నేల మీద మనకు తెలియని కథలు చాలా ఉంటాయి. మనం మూలాలు తెలుసుకోవడం ఎప్పుడూ కూడా ఆసక్తికరంగా ఉంటుంది అలాంటి మూలాన్ని, కథని చెప్పాలనుకునే ప్రయత్నం ఇందులో చేశాం.
మిక్కీ జే మేయర్ గారి మ్యూజిక్ గురించి?
మిక్కి కెరీర్ లో ఇది బెస్ట్ ఆల్బమ్. రకరకాల మ్యూజిక్ జోనర్స్ ఉండే ఆల్బమ్ ఇది. డిఫరెంట్ కంపోజిషన్స్ ఉన్నాయి. అన్ని సాంగ్స్ బ్రహ్మాండంగా ఆడియన్స్ లోకి వెళ్ళాయి. ఈ మధ్యకాలంలో ఒక ఆల్బమ్ లో ఇన్ని హిట్ సాంగ్స్ రాలేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా చేశారు. నిజానికి మిక్కీ యూఎస్ లోనే ఉంటారు. కానీ ఈ సినిమా కోసం ఆయన ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి మ్యూజిక్ చేశారు.
ఈ సినిమా నుంచి ఒక దర్శకుడిగా మీరేం నేర్చుకున్నారు?
నిజానికి చాలా గ్యాప్ తర్వాత సినిమా తీస్తున్నాను. మన సంకల్పం బలంగా ఉంటే అన్నీ కుదురుతాయి అని అంటారు. నా విషయంలో అది నిజంగా జరిగిందని భావిస్తున్నాను. వైజయంతి, స్వప్న సినిమాస్ బ్యానర్లో సినిమా దొరకడం, వాళ్ళు ఈ కథని నమ్మి బడ్జెట్ పెట్టడం చాలా ఆనందంగా ఉంది.
నాగ్ అశ్విన్ గారు సినిమా చూశారా ?
ఆయన సినిమా చూశారు. ఆయనకు చాలా నచ్చింది. నాగి గారు ఎవరి సినిమాలో ఇన్వాల్వ్ కారు. ఏదైనా హెల్ప్ కావాలంటే ఖచ్చితంగా చేస్తారు. కావలసినప్పుడు సజెషన్స్ ఇస్తారు.
రామ్ చరణ్ గారు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఈ సినిమాని లగాన్ తో పోల్చారు కదా.. ఎలా అనిపించింది?
ఆయన అబ్జర్వేషన్ చూసి నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఇది హీరో సెంట్రిక్ ఫిలిం కానీ విలేజ్ లోకి వెళ్ళిన తర్వాత చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. ఇది బైరాన్ పల్లి తో పాటు హీరో కలిసి చేసే ఫైట్. ఆయన ట్రైలర్ చూసి ఆ పోలిక తీసుకురావడం చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది.
ఒక దర్శకుడిగా ఎలాంటి కథలు చెప్పాలనుకుంటున్నారు నెక్స్ట్ మీ ప్లాన్స్ ఏమిటి?
రిజల్ట్ ని బట్టి ప్లాన్ ఉంటుంది. ఛాంపియన్ రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నాను. దర్శకుడిగా నా బలం గురించి చెప్పాలంటే నేను డ్రామాని బాగా హ్యాండిల్ చేయగలను. ఏం చేసినా కూడా డ్రామా బలంగా ఉండేలా కథలు రాసుకుంటాను.


